మార్చ్ నెలలో రానున్న సరికొత్త 2014 ఫియట్ లీనియా

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫియట్ లీనియాలో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త 2014 ఫియట్ లీనియా సెడాన్‌ను కంపెనీ ఇటీవలే ముగిసిన 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

మార్చ్ 2014 నాటికి ఈ సరికొత్త ఫియట్ లీనియాను వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ కొత్త ఫియట్ లీనియా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌ను చూడొచ్చు. అయితే హెడ్‌ల్యాంప్స్ మాత్రం ఇదివరకటి మోడల్‌వే ఉపయోగించారు.


కాకపోతే, ఇందులో ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ మాత్రం కొత్తదిగా అనిపిస్తుంది. ముందువైపు క్రోమ్ గార్నిష్, డోర్స్‌పై క్రోమ్ స్ట్రిప్స్‌తో ఇది పాత లీనియా కన్నా మరింత ప్రీమియం అప్పీల్‌నిస్తుంది. వెనుక వైపు చేసిన డిజైన్ మార్పుల విషయానికి వస్తే, బూట్ డోర్‌ పైకి మార్చబడిన లైసెన్స్ ప్లేట్, క్రోమ్ గార్నిష్, క్రోమ్ స్ట్రిప్ కలిగిన రియర్ బంపర్, రివైజ్డ్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

ఇంటీరియర్స్‌లో కూడా కొద్దిపాటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఫ్రెష్ లుక్‌నిచ్చేలా రివైజ్ చేసిన ఇంటీరియర్స్, కొత్త సెంటర్ కన్సోల్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఆడియో సిస్టమ్‌లను ఇందులో జోడించారు. మరింత నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో మరియు చిన్నిపాటి డిజైన్ మార్పులతో ఇంటీరియర్లను మెరుగుపరచారు.

New Fiat Linea

ఈ సరికొత్త 2014 ఫియట్ లీనియా వచ్చే నెలలో (మార్చ్ 2014లో) మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వెంటో వంటి మిడ్-సైజ్ సెడాన్లతో పోటీ పడనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Fiat hopes to get into the thick of battle in the entry level sedan category with the launch of the all new 2014 Linea. Revealed for the first time in India at the Auto Expo 2014, the facelifted Linea not just looks more interesting, but also brings other weapons to the battle.
Story first published: Monday, February 17, 2014, 15:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X