ఆగస్టు నెలలో కొత్త 2014 ఫియట్ పుంటో విడుదల

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పుంటో హ్యాచ్‌బ్యాక్‌లో ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోందని మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. అయితే, ప్రస్తుత పాత ఫియట్ స్టాక్ త్వరగా క్లియర్ అవుతున్న నేపథ్యంలొ, కొత్త 2014 ఫియట్ పుంటోను ఆగస్టు నెలలో విడుదల చేయాలని కంపెనీ నిర్ణించినట్లు తాజా సమాచారం.

ఫియట్ ఇండియా 2009లో తమ పుంటోను దేశీయ విపణిలో విడదల చేసింది. అప్పటి నుంచి ఈ కారులో చిన్నపాటి మార్పులు తప్ప చెప్పుకోదగిన అప్‌గ్రేడ్స్ ఏమీ చేయలేదు. ఈ నేపథ్యంలో, ఇదివరకి ఫియట్ పుంటోలన్నింటికీ భిన్నంగా, మరింత స్టయిలిష్‌గా, ప్రీమియంగా ఉండేలా ఫియట్ తమ కొత్త 2014 మోడల్‌ని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఫియట్ పుంటో హ్యాచ్‌బ్యాక్‌ను మహారాష్ట్రలోని పూనే సిటీ రోడ్ల టెస్టింగ్ కూడా చేస్తున్నారు.


కొత్త 2014 ఫియట్ పుంటో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో చెప్పుకోదగిన మార్పులు ఉండనున్నాయి. ఇందులో ప్రధానంగా.. హెడ్‌లైట్స్, టెయిల్ ల్యాంప్స్, ఫ్రంట్ గ్రిల్ అండ్ బంపర్స్‌ను రీడిజైన్ చేశారు. ఫాగ్‌ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. ఇంటీరియర్లను కూడా మరింత ప్రీమియం అప్పీల్‌ను ఇచ్చేలా, కొత్త లీనియా సెడాన్‌లో ఉన్నట్లుగానే అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, ఏసి వెంట్స్, సెంటర్ కన్సోల్‌లు పియానో బ్లాక్ ఫినిష్‌ను కలిగి ఉండనున్నాయి. డ్యాష్‌బోర్డ్ బ్లాక్ అండ్ బీజ్ కలర్ కాంబినేషన్‌తో లభ్యం కానుంది.

కొత్త పుంటోలో కాస్మోటిక్ మార్పులు తప్ప ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం విక్రయిస్తున్న పుంటోలో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే కొత్త 2014 పుంటోలోను ఉపయోగించనున్నారు. అయితే పెట్రోల్ వెర్షన్ మాత్రం రెండు ఇంజన్ ఆఫ్షన్లతో 91.2 లీటర్, 68 పిఎస్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.4 లీటర్, 90 పిఎస్ పెట్రోల్ ఇంజన్) లభ్యం కానుంది.

2014 Fiat Punto Hatchback

డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌నే ఆఫర్ చేయనున్నారు. అయితే, ఇది 76 పిఎస్ పవర్ మరియు 93 పిఎస్ పవర్ ఆప్షన్లతో రెండు విభిన్న ట్యూనింగ్‌లలో లభ్యం కానుంది. ఈ ఇంజన్లన్నీ కూడా 5-మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభ్యం కానున్నాయి. ఇందులో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) అందుబాటులో ఉండబోదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
The Italian based car manufacturer Fiat India will be launching a new and refreshed version of its Punto hatchback in August this year. The 2014 Punto will receive significant cosmetic updates. However, under the hood no changes will be made, which is a bit disheartening.
Story first published: Saturday, June 28, 2014, 13:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X