ఇన్‌బిల్ట్ వాక్యూమ్ క్లీనర్‌తో 2014 హోండా ఒడిస్సీ ఎమ్‌పివి

By Ravi

కారు లోపలి ఇంటీరియర్స్‌ను శుభ్రం చేసుకునేందుకు ఎక్స్‌టర్నల్ వాక్యూమ్ క్లీనర్స్‌పై ఆధారపడేందుకు బదులు కారులోనే ఇన్‌బిల్ట్ వాక్యూమ్ క్లీనర్ ఉంటే ఎలా ఉంటుంది..? ఇదిగా ఈ ఫొటోలను చూడండి. జపనీస్ కార్ కంపెనీ హోండా మోటార్ కార్పోరేషన్ గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న ఎమ్‌పివి 'హోండా ఒడిస్సీ' (Honda Odyssey)లో ఓ ఇన్‌బిల్ట్ వాక్యూమ్ క్లీనర్‌ను అమర్చింది. ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఆటో షోలో కంపెనీ తమ అధునాతన 2014 హోండా ఒడిస్సీ ఎమ్‌పివిని ఆవిష్కరించింది.

కారులో ఇన్‌బిల్ట్ వాక్యూమ్ క్లీనర్‌ను అమర్చటం ప్రపంచంలోకెల్లా ఇదే మొదటిసారి. పెద్ద కుటుంబాలు, వాణిజ్య అవసరాల కోసం హోండా అందిస్తున్న ఒడిస్సీ ఎమ్‌పివి ఈ సెగ్మెంట్లో లీడర్‌గా ఉంది. 2012 హోండా ఒడిస్సీ ఎమ్‌పివిలో హోండావ్యాక్ (HondaVAC) అనే కాంపాక్ట్ వాక్యూమ్ క్లీనర్‌ను కారుకు వెనుక భాగపు బాడీలో అమర్చారు. వాక్యూమ్ క్లీనింగ్ సిస్టమ్‌లను తయారు చేయటంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన షాప్-వ్యాక్ అనే సంస్థతో హోండా చేతులు కలిపి హోండావ్యాక్‌ను అభివృద్ధి చేసింది.

కారులో అమర్చిన ఇన్‌బిల్ట్ వ్యాక్యూమ్ క్లీనర్‌లో రీప్లేస్ చేసుకోవటానికి వీలుండే ఫిల్టర్, కానిస్టర్ బ్యాగ్, వివిధ ఏరియాల్లో క్లీన్ చేసుకునేందుకు విభిన్న నాజిల్స్ ఉంటాయి. ఇందులో ఉండే పొడవాటి పైపు సాయంతో కారులోని మూలమూలను శుభ్రం చేసుకోవచ్చు. ఈ హోండావ్యాక్‌ను ఆపరేట్ చేసేందుకు బయటి విద్యుత్ అవసరం లేదు. కారు ఇంజన్‌ను స్టార్ట్ చేసి ఉంచి, ఈ వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇంజన్ ఆన్‌చేయకపోయినప్పటికీ, బ్యాటరీ పవర్ సాయంతో ఇది 8 నిమిషాల వరకూ పనిచేస్తుంది. మరి బాగుంది కదూ ఈ వాక్యూమ్ క్లీనర్ కార్..

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

2014 హోండా ఒడిస్సీ

Most Read Articles

English summary
ld's first in car vacuum system. The 2014 Honda Odyssey has made it's debut at the New York International Auto Show.
Story first published: Saturday, March 30, 2013, 15:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X