ఇండియన్ కార్స్ గురించి మేము నోటీస్ చేసిన 10 విషయాలు

By Super

ఈ సామెత ఎక్కడో విన్నట్టుంది కదూ.. వాస్తవానికి పూర్వం యదా రాజ తదా ప్రజా అనేవారు కదా, కానీ ఇక్కడ 'యదా కస్టమర్స్.. తదా కార్స్..' అని ఎందుకు అంటున్నారు? ఇందుకు ఓ బలమైన కారణం ఉంది, అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

భారతదేశంలో మనం కొన్ని విషయాలను ఇతర దేశాల కన్నా భిన్నంగా చేస్తుంటాం. రోడ్డుపై ఇతరులకు సరైన దారి చెప్పడంలో సహకరించే మనం, మన విషయానికి వచ్చే సరికే షార్ట్ కట్స్ ఫాలో అవుతుంటాం. అది రాంగ్ రూట్ అయినా సరే పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోతుంటాం. రోడ్డుపై అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటాం, అనవసరంగా చెవులు చిల్లులు పడేలా హారన్ మ్రోగిస్తుంటాం, రోడ్డుపై కోపంతో ఊగిపోతూ లేని గొడవలను తెచ్చుకుంటుంటాం. ఇలా ఉంటుంది మన రోడ్లపై డ్రైవింగ్ అనుభూతి.

మనలాగే మన కార్లు వాటి స్వంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాయి. భారతదేశంలో వ్యక్తిగత రవాణా (పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్) అనే చాలా క్లిష్టమైన విషయం. అందుకే, కార్ మేకర్లు కూడా ప్రత్యేకించి భారతదేశం కోసమే అన్నట్లుగా కార్లను డిజైన్ చేస్తుంటారు, ఇవే కార్లు యూరోపియన్ మార్కెట్లలో కూడా లభ్యమవుతున్నప్పటికీ, వాటితో పోల్చుకుంటే మనదేశంలో లభ్యమయ్యే కార్లు చాలా 'భిన్నంగా' (బహుశా నాసిరకంగా అనొచ్చేమో) ఉంటున్నాయి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

యధా కస్టమర్స్.. తదా కార్స్..

మన ఇండియన్ కార్స్ గురించి మేము నోటీస్ చేసిన ఆ 10 విషయాలు ఏంటో, వాటితో మీరు ఏకీభవిస్తారో లేదో తెలుసుకునేందుకు తర్వాతి స్లైడ్‌లను పరిశీలించండి.

1. మన కార్లు చాలా చిన్నవి

1. మన కార్లు చాలా చిన్నవి

మనదేశంలో లభించే కార్లలో అత్యధిక శాతం కార్లు చాలా చిన్నవిగా ఉంటాయి. వాహనాల రద్దీ, పార్కింగ్ సమస్యలు, ధర మొదలైన అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని కార్ మేకర్లు అత్యంత ఇరుకుగా ఉండే కార్లను తయారు చేస్తుంటారు. మనదేశంలో వాహనాల పరిమాణాన్ని నిర్దేశించేందుకు చట్టాలు కూడా ఏర్పడ్డాయి. ఉదాహరణకు నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండే కార్లపై తక్కువ ఎక్సైజ్ సుంకం వర్తిస్తుంది, అందుకే చాలా మంది కార్ మేకర్లు ఎక్కువగా కాంపాక్ట్ కార్లను తయారు చేస్తుంటారు. ఫలితంగానే, మనదేశంలో కాంపాక్ట్ కార్లే రాజ్యమేలుతున్నాయి.

మనదేశంలో టాటా నానో కారును కాంపాక్ట్ కార్ అని చెప్పుకుంటే, అమెరికాలో షెవర్లే క్రూజ్ సెడాన్‌నే కాంపాక్ట్ కారుగా పరిగణిస్తారు. బహుశా అమెరికాలో హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి కార్లను రోలర్ స్కేట్‌గా పరిగణిస్తారేమో (సరదాకి లెండి..).

2. హ్యాచ్‌బ్యాక్‌లకు 'డిక్కీ' తగిలిస్తున్నారు

2. హ్యాచ్‌బ్యాక్‌లకు 'డిక్కీ' తగిలిస్తున్నారు

మన భారతీయ డ్రైవర్లు కారులో తాము ప్రయాణించడంతో పాటుగా, డిక్కీలో కొంత లగేజ్‌‌ను తీసుకువెళ్లగలితే బాగుంటుందని భావిస్తుంటారు. అందుకే, ఇప్పుడు కార్ మేకర్లు మన అభిరుచుకి అనుగుణంగా హ్యాచ్‌బ్యాక్‌లకు కూడా డిక్కీ తగిలిస్తున్నారు.

ఉదాహరణకు.. హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో అంత సక్సెస్‌ఫుల్ కారు కాలేకపోయింది. బహుశా దీని లుక్ అండ్ డిజైన్ సరిగ్గా లేకపోవటమే దీని వైఫల్యానికి కారణం అయి ఉండొచ్చు. కానీ, అదే బ్రయోకు బూట్ (డిక్కీ)ని తగిలించే, హోండా అమేజ్ పేరుతో విక్రయించినప్పుడు ఆ కారు మంచి సక్సెస్‌ను సాధించింది. మారుతి స్విఫ్ట్, డిజైర్ మోడళ్ల విషయంలోను ఇలానే జరిగింది. ఒకప్పటి డిజైర్ (4 మీ. ఎక్కువ పొడవు ఉండేది) ఇప్పటి డిజైర్ (4 మీటర్ల కన్నా తక్కువ ఉండేది) ఎక్కువ పాపులర్ అయ్యింది.

3. 'క్రోమ్'తో మె(ము)రిపిస్తున్నారు..

3. 'క్రోమ్'తో మె(ము)రిపిస్తున్నారు..

మన భారతీయ కొనుగోలుదారులకి మెరిసే వస్తువులంటే చాలా ఇష్టం. అందులోను ప్రత్యేకించి కార్లు మెరుపులతో తళతళలాడుతుంటే, అలాంటి కార్లు తొలిచూపులోనే మన దృష్టిని ఆకర్షించేస్తాయి. కార్ మేకర్లు కూడా ఇదే వీక్‌నెస్‌ను ఆసరగా చేసుకొని తమ కార్లను క్రోమ్ ఫినిషింగ్స్‌తో మెరిపించి, మనల్ని మురిపించే ప్రయత్నం చేస్తున్నారు.

వాస్తవానికి కారుకు క్రోమ్ గార్నిష్ చేయటం వలన కారుకు ప్రీమియం టచ్, అప్‌మార్కెట్ ఫీల్ లభిస్తుంది. కానీ మోతాదుకు మించి క్రోమ్ గార్నిష్ చేస్తే, ఉన్న అందం కాస్తా పోయి మరింత వికారంగా తయారవుతుంది. కనీస స్పోర్టీ ఎలిమెంట్స్‌తో కార్లను తయారు చేయటంలో ప్రపంచ ఫేమస్ అయిన హోండా కూడా, ఇండియన్ కస్టమర్ల కోసం తమ సిటీ సెడాన్‌కు క్రోమ్ గార్నిష్ చేయాల్సి వచ్చింది. ఇది కంపెనీ ఇష్టంతో చేసిందా లేక ఇండియన్ కస్టమర్స్ టేస్ట్‌కు అనుగుణంగా చేసిందా అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఇదిగో ఈ ఫొటోలో ఓ ఇన్నోవా ఎమ్‌పివి వెనుక భాగంలో లైసెన్స్ ప్లేట్‌కు ఎగువన అమర్చిన క్రోమ్ బార్ ఎలా తళతళా మెరుస్తుందో.

4. స్పోర్ట్ వెర్షన్స్, లిమిటెడ్ ఎడిషన్స్.. (పేరుకు మాత్రమే)

4. స్పోర్ట్ వెర్షన్స్, లిమిటెడ్ ఎడిషన్స్.. (పేరుకు మాత్రమే)

మన ఇండియన్స్‌కి సాధారణ వస్తువుని కొత్తగా చూపితే, దానిని సొంతం చేసుకునేందుకు క్యూ కడతారు. కార్ మేకర్లు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుంటారు. ఉదాహరణకు ఓ రెగ్యులర్ కారును కొనడానికి వెనుకంజ వేసే కస్టమర్లు, అదే రెగ్యులర్ కారును స్పోర్ట్ అనో లేక లిమిటెడ్ ఎడిషన్ అనో అదనపు బాడీ గ్రాఫిక్స్, కొన్ని అదనపు ఫీచర్లు జోడించి విక్రయిస్తే కొనుగోలు చేసేందుకు ఎగబడుతారు.

వాస్తవానికి, ఇక్కడ పేరులో మార్పు తప్పించి, ఇంజన్ పరంగా కానీ లేదా బేసిక్ డిజైన్ పరంగా కానీ ఎలాంటి మార్పులు ఉండబోవు. కేవలం కొన్ని అదనపు ఫీచర్లు జోడించడం వల్లనే కస్టమర్ల కొనుగోలు ఆలోచనలో మార్పును తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కార్ మేకర్స్. ఇటీవలే విడుదలైన గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ ఇందుకు చక్కటి ఉదాహరణ, ఈ కారు పేరు, గ్రాఫిక్స్, ఇంటీరియర్స్‌లో మార్పు తప్ప, పేరుకు తగినట్లుగా స్పోర్టీ పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా దీని ఇంజన్‌ను ట్యూన్ చేయలేదు. ఈ ఫొటోలో మీరు చూస్తున్నది మారుతి 800 యూనిక్ స్పెషల్ ఎడిషన్. ఇందులో కొత్త గ్రాఫిక్స్‌ తప్ప యునిక్‌గా మీకేమైనా అనిపిస్తోందా..?

5. సేఫ్టీ కావాలంటే.. కాసులు కురిపించాల్సిందే..

5. సేఫ్టీ కావాలంటే.. కాసులు కురిపించాల్సిందే..

మనదేశంలో బడ్జెట్ కార్లలో సేఫ్టీ ఫీచర్ల కన్నా అందులో లభించే ఇతర ఫీచర్లకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం. అలాగే కార్ మేకర్లు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అయుపోతుంటారు. ఉదారహణకు.. ఓ కస్టమర్ కార్ షోరూమ్‌కి వెళ్లి ఈ కారులో ఏబిఎస్ ఉందా అని అడగటానికి బదులుగా, ఈ కారులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉందా అని అడుగుతాడు. ఈ తీరుని గమనించిన కార్ మేకర్స్ కూడా తమ కార్లలో బ్లూటూత్ ఫస్ట్, సేఫ్టీ లాస్ట్ అన్నట్లుగా ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు.

మనదేశంలో లభిస్తున్న కార్లలో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈఎస్‌పి వంటి సేఫ్టీ ఫీచర్లు కావాలంటే, ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా కస్టమర్ ఎక్కువ డబ్బులు చెల్లించైనా సరే ఈ సేఫ్టీ ఫీచర్లను పొందాలనుకుంటే, కొన్ని రకాల కార్లలో అలాంటి సేఫ్టీ ఫీచర్లను ఆప్షనల్‌గా కూడా జోడించుకునే వెసలుబాటు లేకపోవటమే. అదే విదేశాల్లో లభ్యమయ్యే కార్లలో కనీసం ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ వంటి ఫీచర్లయినా స్టాండర్డ్‌గా లభిస్తుంటాయి.

6. ఓహ్.. టెర్రిబల్ కార్ యాక్ససరీస్

6. ఓహ్.. టెర్రిబల్ కార్ యాక్ససరీస్

మనదేశంలో లభ్యమయ్యే కార్లకు కార్ మేకర్లు అందించే అఫీయల్ యాక్ససరీస్ జాబితే చిన్నదే. కానీ, అదే కారుకు థర్డ్ పార్టీ వెండర్ వద్ద లభించే యాక్ససరీస్ జాబితా మాత్రం చాంతాడంత ఉంటుంది. ఫ్రంట బంపర్ గార్డ్ మొదలుకొని ఎక్స్‌ట్రా లైట్స్, రూఫ్ ర్యాక్స్, రియర్ స్పాయిలర్, రియర్ బంపర్ ప్రొటెక్టర్ వరకు అనేక రకాల థర్డ్ పార్టీ యాక్ససరీలు అందుబాటులో ఉంటాయి. వీటిని అమర్చుకుంటే కొన్ని కార్లు అందగా కనిపిస్తాయి, మరికొన్ని కార్లు వికారంగా మారిపోతుంటాయి.

ఏదేమైనప్పటికీ, ఒక కారుకు సరిగ్గా సరిపోయే బెస్ట్ యాక్ససరీలు చాలా తక్కువగా అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకించి ఇలాంటి యాక్ససరీలను థర్డ్ పార్టీలు తయారు చేస్తుండటం వలన అన్ని కార్లకు సరిగ్గా ఫిట్ కాకపోవచ్చు. ఇందులో కొన్ని రకాల యాక్ససరీలు ప్రమాదకరంగా కూడా మారవచ్చు. ఇదిగో ఈ ఫొటోలో ఇన్నోవాకు అమర్చిన సైడ్ ఫుట్ స్టెప్‌ను చూడండి. కారు పరిమాణానికి మించి బయటకు కనిపిస్తున్న ఈ యాక్ససరీ కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా కూడా మారవచ్చు.

7. బీజ్ కలర్ ఇంటీరియర్స్ (నీట్‌గా ఉంచడం కష్టం)

7. బీజ్ కలర్ ఇంటీరియర్స్ (నీట్‌గా ఉంచడం కష్టం)

లైట్ కలర్ ఇంటీరియర్స్‌ను నీట్‌గా ఉంచడం కష్టం. ప్రత్యేకించి దుమ్ము, ధూళి, కాలుష్యంతో నిండిపోయిన రోడ్లపై నిత్యంత ప్రయాణించే కార్లలోని లైట్ కలర్ ఇంటీరియర్స్ త్వరగా మురికి పట్టిపోతుంటాయి. అయినప్పటికీ, మన ఇండియన్ బయ్యర్స్ మాత్రం ప్రీమియంగా కనిపించే లైట్ కలర్ ఇంటీరియర్స్‌కే ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే, కార్ మేకర్లు తమ కార్లలో బీజ్ కలర్ ఇంటీరియర్స్‌ను ఉపయోగిస్తుంటారు. బీజ్ కలర్ ఇంటీరియర్స్ చూడటానికి బాగానే ఉంటాయి కానీ, ఇండియన్ రోడ్లపై వీటిపై నీట్‌గా ఉంచుకోవటం అనేది మాత్రం ప్రశ్నార్థకమే.

8. స్పోర్టీ కార్స్ చాలా అరుదు

8. స్పోర్టీ కార్స్ చాలా అరుదు

మనదేశంలో స్పోర్టీ కార్స్ చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. స్పోర్టీ కార్స్ తక్కువ ధరలో అందుబాటులో ఉండకపోవటం, అలాంటి కార్లను నడిపేందుకు సరైన రోడ్లు లేకపోవటం, మైలేజ్ గురించి చింతించడం, మొత్తం ఫ్యామిలీ ఒకే కారులో ప్రయాణించాలనుకోవటం మొదలైన కారణాలను చెప్పుకోవచ్చు. కారణం ఏదేమైనప్పటికీ, మన రోడ్లపై మనం చాలా అరుదుగా స్పోర్టీ కార్లను చూస్తుంటాం.

9. పెద్ద వీల్ ఆర్చెస్.. కానీ చిన్న వీల్స్..

9. పెద్ద వీల్ ఆర్చెస్.. కానీ చిన్న వీల్స్..

మనం నడిపే కార్లకు పెద్ద వీల్ ఆర్చెస్ ఉంటాయి, కానీ వీల్స్ మాత్రం చాలా చిన్నవిగా ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం మన రోడ్లే. రోడ్డుపై గోడల మాదిరిగా నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు, ఎల్లప్పుడూ నోర్లు తెరచుకొని ఉండే మ్యాన్‌హోల్స్, వర్షం పడితే పెద్దవయ్యే పాట్‌హోల్స్ ఇలాంటి అతుకుల, గతుకుల రోడ్లపై రోజూవారీ ప్రయాణం ఓ సర్కస్ లాంటిదే అని చెప్పాలి. అందుకే, మన కార్ వీల్ ఆర్చెస్‌ను పూర్తిగా నింపే టైర్లు ఇంకా మనకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయితే, మారుతున్న పరిస్థితులు, మెరుగుపడుతున్న మన రోడ్ నెట్‌వర్క్ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ట్రెండ్ మారే అవకాశం కనిపిస్తుంది.

10. తక్కువ స్పేస్.. ఎక్కువ లోడ్..

10. తక్కువ స్పేస్.. ఎక్కువ లోడ్..

మన కార్లలో ఇంటీరియర్ స్పేస్ ఓ పెద్ద సవాల్. ప్రతి కార్ మేకర్ కూడా ఇండియాలో విక్రయించే కార్లలో సాధ్యమైనంత ఎక్కువ ఇంటీరియర్ స్పేస్ ఆఫర్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. మనం కూడా అందుబాటులో ఉన్న ఇంటీరియర్ స్పేస్‌లోనే అందరినీ సర్దేస్తుంటాం. ఉదాహరణకు, ఓ మధ్యతరగతి కుటుంబం ఆల్టో కారునే ఇన్నోవా కారుగా పరిగణిస్తుంది. నలుగు మాత్రమే సౌకర్యంగా కూర్చోగలిగిన ఆ చిన్న కారులో 6గురు లేదా 7గురు సర్దుకొని కూర్చొని వెళ్తుండటాన్ని మనం గమనిస్తుంటాం.

గమనిక:

గమనిక:

ఈ కథనం ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు. ప్రస్తుతం మనదేశంలో లభిస్తున్న కార్లు, మనదేశ స్థితిగతులు మొదలైన అంశాల నుంచి స్ఫూర్తి పొంది దీనిని వ్రాయటం జరిగినదని పాఠకులు గమనించగలు.

ఈ కథనంలో పేర్కొన్న విషయాలతో మీరు ఏకీభవిస్తారో లేదా అనేది కామెంట్ల రూపంతో మాతో, మా పాఠకులతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
Indian cars are quite different from cars in other countries. We bring you a list of ten unique qualities of cars in India that differentiate them from others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X