2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ ఫోటోలు, వివరాలు వెల్లడి

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న చిన్న కారు 'పోలో'లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ సరికొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ రానున్న మార్చ్ నెలలో జరగనున్న 2014 జెనీవా మోటార్ షోలో విడుదల కానుంది. ఇది యూరోపియన్ వెర్షన్ పోలో. ఇండియన్ వెర్షన్ పోలో కూడా ఇంచు మించు ఇలాంటి మార్పులు ఉండనున్నట్లు సమాచారం.

మే 2014 నాటికి ఈ సరికొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయి. 2014 పోలో కారు కొత్త బంపర్, హెడ్‌ల్యాంప్స్, ఆప్షనల్ ఈఎల్ఈ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు లైట్‌గా క్రోమ్ టచ్, వెనుక వైపు కొత్త టెయిల్ లైట్స్, సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ వంటి కాస్మోటిక్ మార్పులు చాలానే ఉన్నాయి.


ఇంటీరియర్స్ విషయానికి వస్తే, యూరోపియన్ వెర్షన్ 2014 పోలో హ్యాచ్‌బ్యాక్‌లో ఇంటీరియర్స్ లగ్జరీ కార్లను తలపించేలా ఉంటాయి. ఇందులో అనేక అత్యాధునిక ఫీచర్లను జోడించారు. అయితే, ఇండియన్ వెర్షన్ కొత్త పోలో కారులో ఈ ఫీచర్ల జాబితా కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ, ప్రస్తుత పోలో కారులోని ఇంటీరియర్స్ కన్నా ఇవి మెరుగ్గా ఉంటాయని తెలుస్తోంది.
New Polo

కొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో కారులో యాంత్రికపరమైన మార్పులు ఉండబోవని సమాచారం. ప్రస్తుతం భారత మార్కెట్లో పోలో కారులో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే కొత్త పోలో కారులోను ఉపయోగించే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Volkswagen Polo, the smallest four door car offered by the automaker, has received an update for the year 2014. VW has revealed the European spec 2014 Polo, which will be launched at the 2014 Geneva Motor Show in March. The new Polo will hit the roads across Europe and also likely in India around May.
Story first published: Thursday, January 30, 2014, 11:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X