2015 ఆడి క్యూ3 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి, విక్రయిస్తున్న క్యూ3 లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఆడి నుంచి అత్యంత విజయం సాధించిన మోడళ్లలో క్యూ3 మోడల్ కూడా ఒకటి. ఈ కొత్త ఆడి క్యూ3 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మోడల్‌ను గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేయనున్నారు.

ఈ కొత్త ఆడి క్యూ3 ఫేస్‌లిఫ్ట్ 2015 మధ్య భాగం నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఎక్స్టీరియర్ మార్పులను గమనిస్తే, ఇందులో షార్ప్ గ్రిల్, ట్వీక్డ్ హెడ్‌లైట్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, రీడిజైన్డ్ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్, కొద్దిగా విభిన్నమైన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వంటి మార్పులు ఉండనున్నాయి.


అంతేకాకుండా.. డ్రైవర్ కారులో మలుపు తిరిగే టప్పుడు, ఆ మలుపుకు అనుగుణంగా కాంతి కూడా ప్రసరించేలా ఇందులో ఆటో డైనమిక్ టర్న్ హెడ్‌లైట్స్ ఫీచర్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇంటీరియర్స్‌లో కూడా ప్రధాన మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.

మెకానికల్ మార్పుల విషయానికి వస్తే.. కొత్త ఆడి క్యూ3 పవర్, మైలేజ్‌లను కొద్దిగా మెరుగుపరచారు. దీని మైలేజ్‌ను దాదాపు 17 శాతం మెరుగుపరచామని, కర్భన ఉద్ఘారాల విడుదలను కూడా తగ్గించామని కంపెనీ పేర్కొంది. ఇది గ్లోబల్ మార్కెట్లలో 2.0 లీటర్ పెట్రోల్, 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతోను, ఇండియన్ మార్కెట్లో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తోను లభ్యం కానుంది.


ఇందులో 2.0 లీటర్, టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 178 బిహెచ్‌పిల శక్తిని (8 బిహెచ్‌పిల పెంపు) ఉత్పత్తి చేస్తుంది. అలాగే, మరింత పవప్‌ఫుల్ 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 335 బిహెచ్‌పిల శక్తిని (29 బిహెచ్‌పిల పెంపు) ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
2015 Audi Q3 Facelift Rear
Most Read Articles

English summary
German luxury carmaker Audi has revealed the Q3 facelift. The 2015 Audi Q3 facelift will make its global market debut in February next year. Stay tuned for latest updates.
Story first published: Monday, November 10, 2014, 9:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X