ఏలియన్స్‌ను పట్టుకునే హ్యుందాయ్ శాంటాఫే

అవును ఈ హ్యుందాయ్ శాంటాఫే ఎస్‌యూవీ ఏలియన్స్‌ను పట్టుకొని, వాటిని మనుషులకు బానిసలుగా మార్చేస్తుంది. విచిత్రంగా ఉంది కదూ.. అయితే ఇదంతా నిజం కాదులెండి జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే. కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ అండ్ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ శాంటాఫే కోసం కంపెనీ ఓ విశిష్టమైన కమర్షియల్ (టెలివిజన్ ప్రకటన)ను తయారు చేసింది.

ఏలియన్స్ (గ్రహాంతర వాసులను) పట్టుకునే నేపథ్యంలో ఈ ప్రకటన సాగుతుంది. ఇందులో శాంటాఫే ఎస్‌యూవీని నాశనం చేయటానికి వచ్చిన ఏలియన్స్ అన్నీ, అదే ఎస్‌యూవీ చేతికి చిక్కి మనుషులకు బానిసలుగా మారిపోతుంటాయి. ఈ వీడియోలోని చివరి ఘట్టం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మరి ఆ ఫన్నీ కమర్షియల్ వీడియోని మీరు కూడా చూసేయండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/OdJjqVWKw4w?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
ఇక కొత్త హ్యుందాయ్ శాంటాఫే విషయానికి వస్తే.. ఈ ఏడాది గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్ లిమిటెడ్‌ వద్ద నిర్వహించిన 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ తమ సరికొత్త శాంటాఫే ఎస్‌యూవీని విడుదల చేసింది. మునపటి వెర్షన్ శాంటాఫే మోడల్‌ను రీప్లేస్ చేస్తూ, పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై ఈ మోడల్‌ను తయారు చేశారు.

భారత మార్కెట్లో మూడవ తరానికి చెందిన ఈ కొత్త శాంటాఫే ధర రూ.26 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పైమాటే. ఇందులో 2.2 లీటర్ విజిటి (వేరియబల్ జియోమెట్రీ టర్బో) డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 194 బిహెచ్‌పిల శక్తిని, 44.55 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇండన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Hyundai Motor India launches a unique viral campaign Santa Fe Aliens Capture; an initiative to expand the outreach through digital medium. The story unfolds to show how aliens are trying to invade the powerful and dynamic Santa Fe but what happens when the unmatched power of Santa Fe overpowers the supremacies of aliens and how the extraterrestrials end up being the slaves of humans!&#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X