ఏరియల్ నోమ్యాడ్ ఆఫ్-రోడర్ ఆవిష్కరణ

By Ravi

బ్రిటీష్‌కు చెందిన స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఏరియెల్ మోటార్స్, ఓ సరికొత్త ఆఫ్-రోడర్ వాహనాన్ని ఆవిష్కరించింది. ట్రాక్ వెర్షన్ రేస్ కార్లను తయారు చేయటంలో మంచి పాపులారిటీని దక్కించుకున్న ఏరియల్ మోటార్స్, ఇప్పుడు ఆఫ్-రోడింగ్ వాహనాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే, కంపెనీ 'నోమ్యాడ్' (Nomad) అనే ఆఫ్-రోడర్‌ను డిజైన్ చేసింది.

నోమ్యాడ్ ఆఫ్-రోడర్‌ను కంపెనీ విక్రయిస్తున్న అటామ్ కార్లకు మక్కీ బ్రదర్ (మురికి అన్న)గా ఏరియల్ మోటార్స్ అధినేత సిమోన్ సౌండ్రెస్ అభివర్ణించారు. ఇదొక టూ-వీల్ డ్రైవ్ వాహనం. వెడల్పాటి ఆఫ్-రోడ్ టైర్లు, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, రోల్ఓవర్ ప్రొటెక్షన్, రీఇన్‌ఫోర్స్డ్ షాషీ వంటి ఫీచర్లతో ఈ కాన్సెప్ట్‌ను తయారు చేశారు.

Ariel Motors Unveiled Nomad

ఏరియల్ మోటార్స్ ప్రస్తుతం ఈ ప్రోటోటైప్‌ను టెస్టింగ్ చేస్తోంది. ప్రొడక్షన్ వెర్షన్ ఏరియల్ నోమ్యాడ్ ఆఫ్-రోడర్ కంపెనీ విభిన్న కస్టమైజేషన్ ఆప్షన్లను ఆఫర్ చేయవచ్చని సమాచారం. ఇక ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో హోండా నుంచి గ్రహించిన 2.4 లీటర్, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ గేర్‌బాక్స్‌ను హోండా నుంచి గ్రహించినదే. ఇతర ఏరియల్ కార్ల మాదిరిగానే నోమ్యాడ్ కూడా తేలికైన వాహనం. దీని బరువు సుమారు 700 కిలోలు ఉండొచ్చని అంచనా. ఈ కారులో మెకానికల్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్‌ను స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా ఆఫర్ చేస్తున్నారు. అదనపు మొత్తం చెల్లించి మరింత హై-టెక్ సిస్టమ్స్‌ను కూడా పొందవచ్చు.

Most Read Articles

English summary
Ariel Motor Company has taken the wraps off their new model named Nomad which will be showcased in January at Autosport International.
Story first published: Monday, December 29, 2014, 10:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X