ఔరంగాబాద్‌లో ఆడి ఏ3 ఉత్పత్తి షురూ; ఆగస్ట్ 7న విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా తమ ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ 'ఆడి ఏ3'ని ఆగస్ట్ 7, 2014వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కంపెనీ ఇప్పటికే ఈ కారును ఔరంగాబాద్‌లోని తమ ఉత్పత్తి కేంద్రంలో అసెంబ్లింగ్ చేయటం ప్రారంభించింది. ఈ కారు విడుదలకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో, డిమాండ్‌కు అనుగుణంగా ఈ మోడల్‌ను ఆఫర్ చేసేందుకు విడుదలకు ముందే ఉత్పత్తిని ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: పోర్షే మకన్ విడుదల, ధర రూ.1 కోటి

ఆడి ఔరంగాబాద్ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న ఆరవ మోడల్ ఆడి ఏ6 కావటం విశేషం. ఈ ప్లాంట్‌లో ఇప్పటికే ఏ4, ఏ6, క్యూ3, క్యూ5, క్యూ7 మోడళ్లను అసెంబ్లిగ్ చేస్తున్నారు. కాగా.. దేశీయ విపణిలో ఆడి ఏ3 ప్రారంభ ధర రూ.26 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చని అంచనా. ఇప్పటికే ఈ మోడల్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. దీని ధరను అందుబాటులో ఉంచేందుకు గాను, బేస్ వేరియంట్లో ఎల్ఈడి హెడ్‌‌ల్యాంప్స్, లెథర్ ఇంటీరియర్స్ వంటి ఫీచర్లను తొలగించే అవకాశం ఉంది.

Audi A3 Local Production Begins At Aurangabad

అయితే, టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రం ఆడి లగ్జరీని ప్రతిభింభింపజేసేలా అల్లాయ్ వీల్స్, లెథర్ ఇంటీరియర్స్ వంటి ప్రీమియం ఫీచర్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. స్లీక్ అండ్ కాంపాక్ట్ ఆడి ఏ3 కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో (పెట్రోల్, డీజిల్) లభ్యం కానుంది. ఇందులో 1.8 లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 180 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.0 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 152 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: BMW 1-సిరీస్ ఎమ్ ఎడిషన్ విడుదల

గ్రేట్ న్యూస్ ఏంటంటే, ఆడి ఏ3 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఇందులో ఎస్-ట్రానిక్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
German luxury carmaker Audi has started production of A3 sedan at its Aurangabad plant, making it the sixth model to be made at the plant. The Audi A3 sedan will be launched in the Indian market on 7th August 2014.
Story first published: Tuesday, July 22, 2014, 12:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X