మల్టీట్రానిక్ సివిటి ట్రాన్సిమిషన్‌ను నిలిపివేసిన ఆడి

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇకపై తమ కార్లలో సివిటి లేదా కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్ (ఆటోమేటిక్ గేర్ బాక్స్)ను ఉపయోగించబోమని పేర్కొంది. ఇక నుంచి ఆడి తయారు చేసే కార్లలో సివిటి గేర్‌బాక్స్‌ను ఉపయోగించడం నిలిపివేయనున్నారు. దాదాపు దశాబ్ధం క్రితం సివిటి గేర్‌బాక్స్‌ను ఉపయోగించిన తొలి కంపెనీలలో ఆడి కూడా ఒకటి.

ఇది కూడా చదవండి: ఇండియాలో ఆడి ఏ3 ఉత్పత్తి ప్రారంభం

స్వీడన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వి6 టిడిఐ డెవలప్‌మెంట్ హెడ్ రాల్ఫ్ రిగ్గర్ మాట్లాడుతూ.. మల్టీ-ట్రానిక్ (సివిటి సిస్టమ్‌కి ఆడి పెట్టిన పేరు)ను అన్ని మోడళ్లలో నిలిపివేశామని ప్రకటించారు. దీని స్థానంలో కొత్త 7-స్పీడ్, డ్యూయెల్ క్లచ్, ఎస్-ట్రానిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగిస్తామని ఆయన తెలిపారు.

Audi CVT

కొత్తగా పరిచయం చేసిన ఎస్-ట్రానిక్ మరియు ప్రస్తుత టిప్‌ట్రానిక్ (టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్) గేర్‌బాక్స్‌లనే అన్ని భవిష్యత్ మోడళ్లలో ఉపయోగిస్తామని వివరించారు. ఇంజన్ రెవ్స్‌ను తక్కువగా ఉంచడంలో పాత మల్టీట్రానిక్ గేర్‌బాక్స్ చక్కగా పనిచేసేదని, అయితే కొత్త ఎస్-ట్రానిక్ గేర్‌బాక్స్ కూడా అదే తరహాలో పనిచేస్తుందని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: హోండా మొబిలియో ఎంపివి విడుదల

సివిటి గేర్‌బాక్స్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసినట్లు రిగ్గర్ ధృవీకరించారు. దశాబ్ధ కాలం పాటు సివిటి సేవలందించిందని, ఇది చాలా ఫ్యూయెల్ ఎఫీషియెంట్ గేర్‌బాక్స్ అని తెలిపారు. అయితే, తమ కొత్త ఎస్-ట్రానిక్ గేర్‌బాక్స్ దాని కన్నా మరింత మెరుగైనదని చెప్పారు. ఆడి మాతృ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఉపయోగిస్తున్న డిఎస్‌జి గేర్‌బాక్స్ ప్రస్తుత ఎస్-ట్రానిక్ గేర్‌బాక్స్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షనే.

ఈ వీడియో చూశారా..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/rMSL4WKT5Uc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
The German car maker Audi has confirmed that their CVT or Continuously Variable Transmission in their cars have been discontinued. They were one among the first to use this gearbox a decade ago.&#13;
Story first published: Thursday, July 24, 2014, 10:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X