ఏ3 మోడల్‌లో హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టనున్న ఆడి

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, గడచిన ఆగస్ట్ నెలలో విడుదల చేసిన ఏ3 కాంపాక్ట్ లగ్జరీ సెడాన్ అతికొద్ది కాలంలోనే మంచి సక్సెస్‌ను సాధించడంతో కంపెనీ ఇందులో ఓ హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆడి ఏ3 హ్యాచ్‌బ్యాక్‌ను దాని సెడాన్ వెర్షన్ ధర కన్నా మరింత తక్కువ ధరకే అందించడం ద్వారా లగ్జరీ కార్ మార్కెట్లో అగ్రగామిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది.

ఆడి ఇండియా హెడ్ జో కింగ్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఏ3 సెడాన్ కంపెనీ టార్గెట్‌కు మించి అమ్ముడుపోతోందని, కేవలం మూడు నెలల్లోనే దాదాపు 1,000 యూనిట్లు అమ్ముడుపోయాయని, గడచిన సంవత్సరంలో ఆడి ఇండియా మొత్తం 10,000 యూనిట్లకు పైగా కార్లను విక్రయించి, భారత లగ్జరీ కార్ మార్కెట్లో లీడర్‍గా అవతరించిందని ఆయన చెప్పారు.

మొదట్లో తాము హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి ప్రవేశించకుండా విభిన్న వ్యూహంతో ఉండే వారిమని, అయితే ఇప్పుడు తమ ఆలోచనను మార్చుకున్నామని అన్నారు. 'భారత మార్కెట్లో లగ్జరీ అంటే సెడాన్ అని అర్థం. కానీ ఇప్పుడు ఇండియా కోసం ఏ3 హ్యాచ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుంటున్నాం. ఆడి ఏ1 చాలా చిన్న కారైన నేపథ్యంలో, ఇప్పట్లో ఆ మోడల్ విడుదల చేయటం అంత మంచి ఆలోచన కాద'ని జో కింగ్ చెప్పారు.

Audi India Plans To Launch A3 Hatchback

వచ్చే ఏడాది (2015)లో ఆడి ఇండియా మొత్తం 10 కొత్త మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేస్తుందని, ఇందులో కొన్ని రిఫ్రెష్డ్ మోడళ్లు, మరికొన్ని హై-ఎండ్ లగ్జరీ కార్లు ఉంటాయని ఆయన తెలిపారు. స్థానికీకరణ (లోకలైజేషన్)లో (ప్రత్యేకించి ఇంజన్ల లోకలైజేషన్‌లో) ఆడి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను వెచ్చించేందుకు సన్నాహాలు చేస్తోందని జో కింగ్ వివరించారు.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ప్లాంట్‌లో ఆడి అసెంబ్లింగ్ యూనిట్‌లో ప్రతి ఏటా 14,000 కార్లను కంపెనీ స్థానికంగా ఉత్పత్తి చేస్తుంది. రెండు షిఫ్టులను ప్రారంభించడం ద్వారా ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాలీనా 20,000 యూనిట్లకు పెంచనున్నారు. ప్రభుత్వం నుంచి బలమైన సందేశం ఉందని (బహుశా మేక్ ఇన్ ఇండియా గురించి కాబోలు), అందుకే తాము తయారీ, స్థానికీకరణల్లో తమ తర్వాతి స్థాయి పెట్టుబడుల గురించి ప్రణాళికలు వేసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆడి ఏ3 లగ్జరీ కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.8 లీటర్, టిఎఫ్ఎస్ఐ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో ఇంజన్ ఉపయోగించారు. ఇది 177.5 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. డీజిల్ వెర్షన్‌లో 2.0 లీటర్ ఇంజన్ ఉపయోగించారు. ఇది 141 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
After the huge success of its A3 compact luxury sedan, the German luxury carmaker Audi India is now planning to enter the luxury hatchback segment with the launch of the A3 hatchback in India to rival Mercedes’ A-Class and BMW’s 1-Series hatchbacks.
Story first published: Friday, November 7, 2014, 17:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X