మే 1, 2014వ తేదీ నుంచి పెరగనున్న ఆడి కార్ల ధరలు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఉత్పత్తుల ధరలను మరోసారి పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ఉత్పత్తుల ధరలను 3 శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ధరలు మే1, 2014వ తేది నుంచి అమల్లోకి వస్తాయని ఆడి ఇండియా తెలిపింది.

ఇది కూడా చదవండి: ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

అమెరికన్ డాలరుతో పోల్చుకుంటే బలహీనపడుతున్న రూపాయి మారకపు విలువ కారణంగా ఇన్‌పుట్ వ్యయం పెరుగుతున్నందు వలన భారత్‌లో తమ ఉత్పత్తుల ధరల విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఏర్పడిందని ఆడి ఇండియా ప్రకటించింది.

Audi India Price Hike Announced

ప్రస్తుతం ఆడి ఇండియా దేశీయ విపణిలో ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ7 స్పోర్ట్స్‌బ్యాక్, ఆడి ఏ8ఎల్, ఆడి క్యూ3ఎస్, ఆడి క్యూ3, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఎస్4, ఆడి ఎస్6, ఆడి ఆర్ఎస్5 కూపే, ఆడి ఆర్ఎస్7 స్పోర్ట్స్‌బ్యాక్, ఆడి టిటి కూపే, ఆడి ఆర్8, ఆడి ఆర్8 స్పైడర్, ఆడి ఆర్8 వి10 ప్లస్ మోడళ్లను విక్రయిస్తోంది.

కాగా.. గడచిన 2013-14 ఆర్థిక సంవత్సరం అమ్మకాల్లో ఆడి ఇండియా మొత్తం అమ్మకాలు 8 శాతం వృద్ధి చెంది 10,126 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి గాను కంపెనీ మొత్తం అమ్మకాలు 9,350 యూనిట్లుగా నమోదయ్యాయి.

గడచిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల పరంగా ఆడి సాధించిన మూడు రికార్డులు లా ఉన్నాయి:
* అత్యధిక నెలవారీ అమ్మకాలు - 1404 యూనిట్లు (మార్చ్ 2014)
* అత్యధిక త్రైమాసిక అమ్మకాలు - 2740 యూనిట్లు (జనవరి-మార్చ్ 2014)
* అత్యధిక ఆర్థిక సంవత్సర అమ్మకాలు - 10,126 యూనిట్లు (2013 - 2014)

Most Read Articles

English summary
Audi India, the country's largest luxury car manufacturer, has announced a price hike for its vehicles sold in India. Prices of Audi models sold here are set to go up by nearly 3 percent. The new prices will be effective from May 1, 2014.
Story first published: Thursday, April 17, 2014, 12:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X