భారత మార్కెట్లో హ్యాట్రిక్ సాధించిన ఆడి ఇండియా

By Ravi

గడచిన మార్చ్ నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా రికార్డు స్థాయి అమ్మకాలను సాధించింది. 2013-14 ఆర్థిక సంవత్సరం అమ్మకాల్లో ఆడి ఇండియా మొత్తం అమ్మకాలు 8 శాతం వృద్ధి చెంది 10,126 యూనిట్లుగా నమోదయ్యాయి.

కాగా.. ఇదివరకటి ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి గాను కంపెనీ మొత్తం అమ్మకాలు 9,350 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆడి ఇండియా గడచిన ఆర్థిక సంవత్సరంలో 10,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఇప్పుడు కంపెనీ ఈ లక్ష్యాన్ని అధిగమించింది.

Audi Sales

గడచిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల పరంగా ఆడి సాధించిన మూడు రికార్డులు లా ఉన్నాయి:
* అత్యధిక నెలవారీ అమ్మకాలు - 1404 యూనిట్లు (మార్చ్ 2014)
* అత్యధిక త్రైమాసిక అమ్మకాలు - 2740 యూనిట్లు (జనవరి-మార్చ్ 2014)
* అత్యధిక ఆర్థిక సంవత్సర అమ్మకాలు - 10,126 యూనిట్లు (2013 - 2014)

భారత మార్కెట్లో ఒక ఆర్థిక సంవత్సరంలో అది కూడా ఒక కేలండర్‌ ఇయర్‍‌లో 10,000 యూనిట్లు విక్రయించడం అంటే, ఇక్కడ తమ బ్రాండ్‌ బలోపేతం అవుతున్నట్లని ఆడి ఇండియా హెడ్‌ జో కింగ్‌ తెలిపారు. తమ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను పెంచనున్నామని కింగ్‌ అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను 40కి పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.

Most Read Articles

English summary
At the end of last year the German car maker Audi crossed the 10,000 unit sales mark to become the first luxury automaker in the country to do so. In 2014 Audi continues its bullish run in India as the country's largest luxury car manufacturer in terms of sales by setting three new sales records.
Story first published: Saturday, April 5, 2014, 19:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X