యాక్సిడెంట్: మూడు ముక్కలైన బిఎమ్‌డబ్ల్యూ కార్; ఇద్దరు మృతి

By Ravi

మనం ఎంతటి గొప్ప సేఫ్టీ ఫీచర్లు కలిగిన కారులో ప్రయాణిస్తున్నా సరే మన జాగ్రత్తలో మనం లేకపోయినా లేదా అదృష్టం మన వెంటలేకపోయినా ఫలితం మాత్రం శూన్యమే. ఇదిగో ఈ భీకర యాక్సిడెంట్ దృశ్యాలను చూడండి. ఇది లుథియానాలో జరిగింది.

లుథియానాలో ఓ బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కారు యాక్సిడెంట్‌కు గురైంది. యాక్సిడెంట్ సమయంలో కారులో ముగ్గురు ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారంతా 25-27 ఏళ్ల వయస్సు లోపు వారే కావటం గమనార్హం.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మూడు ముక్కలైన బిఎమ్‌డబ్ల్యూ కార్

లుథియానా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరమ్‌జిత్ సింగ్ పన్ను తెలిపిన సమాచారం ప్రకారం, గగన్ శర్మ, రజ్జత్ దువా అనే ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోగా, ధాని రామ్ (కారు యజమాని) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మూడు ముక్కలైన బిఎమ్‌డబ్ల్యూ కార్

ఈ ప్రమాదానికి సంబంధించిన అసలు కారణంగా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, మితి మీరిన వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు నడిపిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడా లేదా అనే అంశాన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయనున్నారు.

మూడు ముక్కలైన బిఎమ్‌డబ్ల్యూ కార్

ఈ ప్రమాదం గడచిన ఆదివారం ఉదయం జరిగింది. వేగంగా వచ్చిన కారు సరభానగర్ రోడ్డుపై అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టను ఢీకొట్టడంతో కారు మూడు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ఫొటోలను చూస్తుంటే, ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉండి ఉంటుందో అంచనా వేయవచ్చు.

మూడు ముక్కలైన బిఎమ్‌డబ్ల్యూ కార్

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ప్రపంచంలో కెల్లా అత్యుత్తమైన సేఫ్టీ కార్లను తయారు చేస్తుంటుంది. సేఫ్టీ విషయంలో ఈ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కానీ, ఈ ప్రమాద తీరును చూస్తుంటే, ఈ కారు సేఫ్టీ విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

మూడు ముక్కలైన బిఎమ్‌డబ్ల్యూ కార్

కాబట్టి.. మన వద్ద ఎంత సురక్షితమైన కారు ఉన్నప్పటికీ, మన జాగ్రత్తలో మనం లేకపోయినట్లయితే, అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పుదు. ఈ ప్రమాదాన్ని చూసైనా కొందరు మేల్కొని, నెమ్మదిగా డ్రైవ్ చేస్తారని మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఆశిస్తోంది.

Most Read Articles

English summary
Two persons were killed while another was critically injured when their BMW car veered off the road and hit a road side tree at wee hours in Ludhiana. 
Story first published: Wednesday, October 29, 2014, 10:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X