2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కార్

By Ravi

ఇటీవలే గ్లోబల్ మార్కెట్లలో విడుదలై, మంచి సక్సెస్‌ను సాధించిన హైబ్రిడ్ కారు 'బిఎమ్‌డబ్ల్యూ ఐ8' (BMW i8) ఈ ఏడాది ఇండియాకు రానుంది. వచ్చే ఫిబ్రవరి 2014లో జరగనున్న 12వ ఎడిషన్ ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ తమ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు 'బిఎమ్‌డబ్ల్యూ ఐ8'ను ప్రదర్శనకు ఉంచనుంది.

పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే ఈ హైటెక్ స్పోర్ట్స్ కారును ధృడమైన కార్బన్ బాడీతో తయారు చేశారు. ఈ బ్రాండ్ తమ టెక్నాలజీకి ప్రతీకగా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, ఈ షోలో 'బిఎమ్‌డబ్ల్యూ ఐ3' (BMW i3) ఎలక్ట్రిక్ కారును చూడాలనకునే వారికి మాత్రమే నిరాశే మిగలనుంది. ఒకప్పుడు ఈ కారును భారత్‌లో కూడా విడుదల చేస్తామని ప్రకటించిన బిఎమ్‌డబ్ల్యూ, ఈ ఏడాది మాత్రం తమ ఐ3 ఎలక్ట్రిక్ కారును ఇండియాకు తీసుకురావటం లేదు.

BMW i8

ఇక బిఎమ్‌డబ్ల్యూ ఐ8 విషయానికి వస్తే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆకర్షనీయమైన లుక్, సరికొత్త స్టయిల్‌తో డిజైన్ చేసిన ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ ద్వారా రియర్ యాక్సిల్ (వెనుక చక్రాలకు) పవర్‌ను అందిస్తుంది. అలాగే, ఇందులో అమర్చిన 125 హెచ్‌పి ఎలక్ట్రిక్ మోటార్ ఫ్రంట్ యాక్సిల్ (ముందు చక్రాలకు పవర్‌ను చేరవేస్తుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.1.5 కోట్ల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా.

ఐ8 స్పైడర్ కారును పూర్తిగా పెట్రోల్ ఇంజన్‌తో కానీ లేదా పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో కానీ లేదా రెండింటిని కలిపి ఒకేసారిగా కానీ ఉపయోగించి డ్రైవ్ చేయవచ్చు. ఇవి రెండు (పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్) కలిపి మొత్తం 349 హెచ్‌పిల శక్తిని, 550 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. బిఎమ్‌డబ్ల్యూ భవిష్యత్తులో తయారు చేయనున్న అన్ని ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్ల యొక్క డ్రైవ్ టెక్నాలజీ కోసం "ఈ-డ్రైవ్" (eDrive)ను ఉపయోగిస్తుంది. ఐ8లో కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగించారు.

Most Read Articles

English summary
German luxury carmaker BMW will showcase its i8 Spyder hybrid sports car at 2014 Indian Auto Expo in February. BMW i8 Spyder is equipped with a 1.5-liter turbo engine and 129 hp electric motor.
Story first published: Thursday, January 2, 2014, 16:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X