బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నుంచి 7-సిరీస్ యాక్టివ్ హైబ్రిడ్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఓ కొత్త హైబ్రిడ్ కారును నేడు (జులై 23, 2014) భారత మార్కెట్లో విడుదల చేయనుంది. బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ యాక్టివ్ హైబ్రిడ్ పేరిట ఈ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నారు. భారత ప్రభుత్వం కూడా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినది.

ఇది కూడా చదవండి: మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ 45 ఏఎంజి విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ యాక్టివ్ హైబ్రిడ్ కారులో 3.0 లీటర్ ఇన్‌లైన్-6 ఇంజన్‌‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 320 బిహెచ్‌పిల శక్తిని, 450 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 55 బిహెచ్‌పిల శక్తిని, 210 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ పేర్కొంది.

BMW 7 Series ActiveHybrid

ఈ కారులో జెడ్ఎఫ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్‌ను ఉపయోగించారు. ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తిని ఈ గేర్‌బాక్స్ వెనుక చక్రాలకు బదిలీ చేస్తుంది. ఇది కేవలం 5.7 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

ఇది కూడా చదవండి: ఆడి ఏ3 సెడాన్ ఉత్పత్తి ప్రారంభం, ఆగస్టులో విడుదల

ఈ హైబ్రిడ్ కారును బిఎమ్‌డబ్ల్యూ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. ఫలితంగా దీని ధర రూ.1.5 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లోని టొయోటా ప్రియస్, క్యామ్రీ హైబ్రిడ్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

ఈ వీడియో చూశారా..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Z-4v4I7Gzk0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
German luxury automobile manufacturer will be launching its ActiveHybrid 7-Series car on the 23rd of July, 2014. The vehicle will be identical to the regular 7-Series, only with a hybrid system. BMW is taking a step into the future by launching hybrid vehicles and preparing the market for its i8, which will be launched in India soon.&#13;
Story first published: Wednesday, July 23, 2014, 10:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X