కొత్త మినీ టీజర్‌ను విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ; 2015లో విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ కార్లను త్వరలోనే అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ ఏడాది ప్యారిస్ మోటార్ షో కంపెనీ విడుదల సరికొత్త మినీ కారును కంపెనీ భారత్‌లో కూడా విడుదల చేయనుంది.

వచ్చే ఏడాది ఆరంభంలో అప్‌డేటెడ్ మినీ కారు భారత్‌కు రానుంది. ఈమేరకు కంపెనీ ఓ టీజర్ ఫొటోను కూడా విడుదల చేసింది. అంతేకాకుండా, ఈ మోడల్ కోసం కంపెనీ ప్రమోషనల్ క్యాంపైన్‌ను కూడా నిర్వహిస్తోంది. ఈ క్యాంపైన్‌లో నెగ్గిన వారు అందరి కన్నా ముందుగా కొత్త మినీ కారును టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని పొందవచ్చు.

BMW Teases New Mini

ఈ అప్‌డేటెడ్ మినీ కారు ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయం అవుతోంది. ఈ కొత్త మోడల్‌లో ఉపయోగించనున్న ఇంజన్ పవర్, పెర్ఫార్మెన్స్‌లను కూడా ట్యూన్ చేయనున్నారు. ఇందులోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 134 పిఎస్‌ల శక్తిని, 219 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 114 పిఎస్‌ల శక్తిని, 269 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇందులో మరింత శక్తివంతమైన మరియు మైలేజ్ ప్రధానమైన వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. పవర్‌ఫుల్ మినీలో 2.0 లీటర్, ఫోర్-సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 189 పిఎస్‌ల శక్తిని, 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో మినీ వన్ అనే వేరియంట్‌లో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. మైలేజ్‌ను దృష్టిలో ఉంచుకొని తక్కువ సామర్థ్యంతో కలిగిన ఇంజన్‌ను ఇందులో ఉపయోగించారు.

మినీ కార్లను బిఎమ్‌డబ్ల్యూ ఇండియా సిబియీ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తున్న నేపథ్యంలో, వీటి ధరలు కూడా అధికంగా ఉండే ఆస్కారం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
BMW is expected to launch the updated Mini, which was showcased at the 2014 Paris Motor Show recently is scheduled to reach the Indian shores by early next year.
Story first published: Monday, October 20, 2014, 16:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X