నవంబర్ 26న బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3, ఎమ్4 మోడళ్ల విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ మరో రెండు కొత్త పెర్ఫార్మెన్స్ కార్లను ఇండియాకు తీసుకురానుంది. బిఎమ్‌డబ్ల్యూకి చెందిన పెర్ఫార్మెన్స్ కార్స్ విభాగం ఎమ్ డివిజన్ ట్యూన్ చేసిన ఎమ్3, ఎమ్4 మోడళ్లను కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టనుంది.

విడుదల సమయం ఎప్పుడు?
బిఎమ్‌డబ్ల్యూ ఈ ఏడాది ఆరంభంలో ఎమ్6 గ్రాన్ కూపే మోడల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. నవంబర్ 26న కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3 సెడాన్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కూపే మోడళ్లను విడుదల చేయనుంది.


డిజైన్ వేరు, ఇంజన్ ఒక్కటే..
డిజైన్, బాడీ టైప్ పరంగా ఈ రెండు మోడళ్లు (ఎమ్3, ఎమ్4) వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఇంజన్ పరంగా మాత్రం ఇవి రెండూ ఒకేలా ఉండనున్నాయి. ఈ రెండు మోడళ్లలో 3.0 లీటర్ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ ట్విన్-టర్బో, సిక్స్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 425 బిహెచ్‌పిల శక్తిని, 56 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్సిమిషన్, ఇంజన్ పెర్ఫార్మెన్స్
ఈ ఇంజన్ సెవన్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ లేదా సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ రెండు కార్లు కేవలం ఐదు సెకండ్ల కన్నా తక్కువ వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. వీటి వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

BMW M4

ఈ ఏడాది (2014) ఆరంభంలో ఎమ్3, ఎమ్4 మోడళ్లను బిఎమ్‌డబ్ల్యూ తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇదివరకటి ప్లాట్‌ఫామ్‌పైనే ఈ కొత్త మోడళ్లను డిజైన్ చేశారు. అయితే, డిజైన్‌లో మాత్రం చెప్పుకోదగిన మార్పులు ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ నుంచి స్ఫూర్తి పొంది ఎమ్3ని, బిఎమ్‌డబ్ల్యూ 4-సిరీస్ నుంచి స్ఫూర్తి పొంది ఎమ్4ని డిజైన్ చేశారు. ఇవి ఈ సెగ్మెంట్లోని ఆడి ఆర్ఎస్5, మెర్సిడెస్ బెంజ్ సి63 ఏఎమ్‌జి వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.
Most Read Articles

English summary
German luxury carmaker BMW's performance wing M division has launched its M6 Gran Coupé earlier this year. Now, the company is planing to launch two more high-powered Bimmers - the M3 sedan and the M4 coupé on November 26 in India.
Story first published: Friday, October 24, 2014, 11:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X