మరో ఉబెర్ సంఘటన; బోస్టన్‌లో ప్యాసింజర్‌పై డ్రైవర్ అత్యాచారం

By Ravi

భారతదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉబెర్ అత్యాచార సంఘటన మర్చిపోక మునుపే అమెరికాలో ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. బోస్టన్‌లో ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఉబెర్ టెక్నాలజీస్ ఇన్‌కార్పోరేషన్‌కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్, ఓ మహిళా ప్యాసింజర్‌పై అత్యాచారం జరిపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

డ్రైవర్ల నియామకం విషయంలో ఇప్పటికే, ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కుంటున్న ఉబెర్‌కు, తాజా ఘటన మరింత తలనొప్పిగా పరిణమించింది. కోట్ల రూపాల వ్యాపారంతో కూడుకున్న ఈ రైడ్ షేరింగ్ వ్యాపారం వలన కంపెనీలు, డ్రైవర్లు లబ్ధి పొందటం మాటేమో కానీ, మహిళలకు మాత్రం భద్రత కరువవుతోంది.

Uber Driver Accused Of Raping Passenger

ఉబెర్ క్యాబ్ సేవలు మహిళలకు ఇండియాలోనే కూడా యూఎస్‌లో కూడా సేఫ్ కాదని తాజా సంఘటన మరోసారి నిరూపించింది. బోస్టన్ ఉబెర్ ఘటన వివరాల్లోకి వెళితే.. అధికారులు తెలిపిన కథనం ప్రకారం, అలెజాండ్రో డన్ అనే 46 ఏళ్ల ఉబెర్ డ్రైవర్, బోస్టన్‌లో నివాసం ఉంటున్న ఓ యువతిని తన కారులో ఎక్కించుకొని, కారును నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు.

ఇటీవలే న్యూఢిల్లీలో కూడా ఓ ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన సంగతి తెలిసినదే. సాంకేతికతను మంచితనానికి ఉపయోగించుకోమని పరిశోధకలు అభివృద్ధి చేస్తుంటే, మనుషులు మాత్రం దానిని చెడు పనులకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సాటి మనిషికి మరో మనిషి భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటే, మనం భూమి మీద ఉన్నామా లేక రాక్షసుల మధ్యలో నివసిస్తున్నామో అర్థం కాని పరిస్థితి. కాబట్టి అమ్మాయిలూ.. మీ జాగ్రత్తలో మీరు ఉండటం కూడా మంచిదే.

Most Read Articles

English summary
An Uber Technologies Inc. driver from Boston has been charged because he took a woman that called for a ride to a secluded area and raped her, a hit for the company that has been assaulted with questions about its driver-screening procedure.
Story first published: Friday, December 19, 2014, 11:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X