బడ్జెట్ 2014: రహదారుల అభివృద్ధి కోసం రూ.37,800 కోట్లు

కేంద్రంలో కొత్తగా ఏర్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం తమ తొలి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. చూడటానికి ఇది 2014-15 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే బడ్జెట్‌ అయినప్పటికీ, ఇందులోని అంశాలు మాత్రం రాబోయే అయిదేళ్లకు, ఇంకా వీలైతే మరో పదిపదిహేనేళ్లకు గట్టి ఆర్థిక, రాజకీయ పునాదిని నిర్మించడమే లక్ష్యంగా రూపొందిన బడ్జెట్‌‌గా కనిపిస్తోంది.

అచ్చే దిన్ ఆనే వాలా హై.. (మంచి రోజులు రాబోతున్నాయ్..) అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కారులోని ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్‌లో భారతదేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి కోసం భారీగా నిధులను కేటాయించారు. ఇందులో మొత్తం రూ.37,000 కోట్లను జాతీయ మరియా రాష్ట్రీయ రహదారుల కోసం కేటాయించారు.

ఇందులో ప్రత్యేకించి రూ.3000 కోట్లను ఈశాన్య భారతదేశంలో ఉపయోగించనున్నారు. ఈ ఏడాది దాదాపు రూ.8,500 కోట్ల వ్యయంతో జాతీయ రహదారులను నిర్మించనున్నారు. కార్ల తయారీదారుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న రోడ్డు నిర్మాణ సమస్యలకు ఈ బడ్జెట్ ఓ చక్కని పరిష్కారంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి వాణిజ్య వాహనాల పరిశ్రమకు ఈ నిర్ణయం ఓ వరం లాంటింది.

ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతినే రోడ్ నెట్‌వర్క్‌ను మెరుగు పరచేందుకు గాను ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.3,000 కోట్లను మంజూరు చేయటం స్వాగతించదగిన విషయం. ఏదేమైనప్పటికీ, తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రోడ్ నెట్‌వర్క్ అభివృద్ధి కోసం మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం మోటారిస్టులలో సంతోషాన్ని కలిగిస్తోంది.

Most Read Articles

English summary
Central finance minister Arun Jaitley has announced the allocation of Rs 37,000 for National and State highways across India with a specific sum of Rs 3,000 crore for Northeastern India in finance Budget 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X