నెక్స్ట్ జనరేషన్ మారుతి ఆల్టో కె10 వస్తోంది..!

By Ravi

మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న ఆల్టో కార్ బ్రాండ్‌లో లభిస్తున్న 1000సీసీ వెర్షన్ 'ఆల్టో కె10'లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గడచిన 2012లో మారుతి సుజుకి విడుదల చేసిన మారుతి ఆల్టో 800 మోడల్ ఆధారంగా చేసుకొనే ఈ కొత్త ఆల్టో కె10 మోడల్‌ను కూడా తయారు చేయనున్నట్లు సమాచారం.

ఈ సరికొత్త మారుతి ఆల్టో కె10 మోడల్‌లో కాస్మోటిక్ మార్పులతో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉండనున్నాయి. డిజైన్ పరంగా చూసుకుంటే, కొత్త ఆల్టో 800 మోడల్ నుంచి స్ఫూర్తి పొంది ఈ సెకండ్ జనరేషన్ ఆల్టో కె10ను డిజైన్ చేసే అవకాశం ఉంది. ఇక యాంత్రికపరమైన మార్పుల విషయానికి వస్తే.. ఇటీవలే మారుతి సుజుకి విడుదల చేసిన సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న అప్‌డేటెడ్ 1.0 లీటర్ కె10 పెట్రోల్ ఇంజన్‌నే ఈ కొత్త ఆల్టో కె10లోను ఉపయోగించనున్నట్లు సమాచారం.

Next Gen Maruti Alto

సెలెరియోలోని ఈ అప్‌డేటెడ్ కె10 ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని 9.1 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఆల్టో కె10లో మార్పులను కేవలం ఎక్స్టీరియర్స్‌కే పరిమితం చేయకుండా ఇంటీరియర్స్‌ను కూడా అప్‌మార్కెట్ ఫీల్‌నిచ్చేలా అప్‌గ్రేడ్ చేయనున్నారు.

ప్రత్యేకించి కొత్త ఆల్టో కె10లో సరికొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్‌ను మనం చూసే అవకాశం ఉంటుంది. ఆల్టో 800లో ఉపయోగిస్తున్న 12 ఇంచ్ రిమ్స్‌కు బదులుగా కొత్త ఆల్టో కె10లో 13 ఇంచ్ రిమ్స్ (వీల్స్) ఉపయోగించనున్నారు. ఈ కొత్త తరం మారుతి ఆల్టో కె10 సిఎన్‌జి ఆప్షన్‌తో పాటుగా ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఆప్షన్‌తో కూడా లభ్యం కానున్నట్లు సమాచారం. ఈ సరికొత్త ఆల్టో కె10 మోడల్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Rumour has it that Maruti Suzuki will introduce a all-new Alto K10 model. The said new model would be powered by updated 1.0-litre K10 engine, which does duty in New Celerio. It will be differentiated by a few cosmetic changes such as revised headlamp, taillamps, body graphics, along with an updated interior.
Story first published: Tuesday, October 7, 2014, 17:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X