మా 'డాట్సన్ గో' కారు సురక్షితమైనదే: నిస్సాన్ ఇండియా

By Ravi

ఇటీవల గ్లోబల్ ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) నిర్వహించిన క్రాష్ టెస్టులో జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్‌కు చెందిన బడ్జెట్ కార్ 'డాట్సన్ గో' సేప్టీలో సున్నా (0) రేటింగ్‌ను దక్కించుకొని, ఘోరంగా విఫలమైన సంగతి తెలిసినదే. అప్పటి నుంచి ఈ మోడల్ అనేక సార్లు వార్తల్లోకెక్కింది.

డాట్సన్ గో కారు నిర్మాణం చాలా బలహీనంగా ఉందని, ఈ కారులో ఎయిర్‌బ్యాగ్‌ని ఆఫర్ చేసినా ప్రయోజనం ఉండదని, ఈ మోడల్‌ను మార్కెట్ నుంచి తొలగించాలని గ్లోబల్ ఎన్‌సిఏపి కోరడం, మరోవైపు ఈ మోడళ్లు భారత రోడ్లకు, భారత ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడే ఉన్నాయని సియామ్ సమర్థించడం కూడా మనం తెలుసుకున్నాం.


అయితే, తాజాగా నిస్సాన్ తమ డాట్సన్ గో కారు సురక్షితమైనదేనని పేర్కొంది. ఈ విషయం గురించి నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ గుయిలామ్ సికార్డ్ మాట్లాడుతూ.. భారత మార్కెట్లో ఆఫర్ చేస్తున్న డాట్సన్ గో సురక్షితమైనదేనని అన్నారు. ఈ కారు బెస్ట్ ఇన్ క్లాస్ బ్రేకింగ్, రోడ్ హోల్డింగ్, అడ్వాన్స్డ్ సస్పెన్షన్, ఇంప్రూవ్డ్ రేంజ్ హెడ్‌ల్యాంప్స్, సౌకర్యవంతమైన సీట్లను కలిగి ఉంటుందని తెలిపారు.

భారత ప్రభుత్వం అక్టోబర్ 2015 నాటికి వాహనాల భద్రతకు సంబంధించి కొన్ని నిబంధనలను కఠినతరం చేయనుంది. ఇవి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, కార్ కంపెనీలు ఇకపై తాము ఉత్పత్తి చేయబోయే అన్ని కార్లలో ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయాల్సి ఉంటుంది. మరి అప్పుడైనా డాట్సన్ తమ గో కారులో ఈ బేసిక్ సేఫ్టీ ఫీచర్లను ఆఫర్ చేస్తుందో లేదా చూడాలి.

Datsun Go

నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేసిన 'వి' (V) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొనే ఈ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను కూడా తయారు చేశారు. నిస్సాన్ మైక్రాలో అమర్చిన 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో కారులోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 106 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ (గేర్‌బాక్స్)తో లభిస్తుంది.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ లీటరుకు 20.63 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) కంపెనీ పేర్కొంది. ఈ విభాగంలో కెల్లా మొదటిసారిగా డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ కోసం రోడ్-సైడ్ అసిస్టెన్స్‌‌ను మరియు 2 ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తోంది. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మొత్తం మూడు వేరియంట్లు, నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో (వైట్, సిల్వర్, స్కై బ్లూ, రూబీ రెడ్) లభిస్తోంది. డాట్సన్ గో ధరలు రూ.3.12 లక్షల నుంచి రూ.3.79 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

Most Read Articles

English summary
Guillaume Sicard, President of Nissan India Operations expressed that the Datsun Go offered in India is safe enough. He explains that the hatchback has best in class braking, road holding, advanced suspension, improved range of headlamps, along with seats that do not tire the driver.
Story first published: Wednesday, November 26, 2014, 16:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X