వీలైనంత త్వరగా డీజిల్ ధరలకు స్వేచ్ఛ కల్పించాలి: రఘురామ్ రాజన్

By Ravi

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావటంతో, భారతదేశంలో డీజిల్ విక్రయంపై నష్టాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వీలైనంత త్వరగా డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వెల్లడించారు.

డీజెల్‌ ధరల నియంత్రణలను ఎత్తివేసేందుకు ఇదే మంచి అవకాశమని, అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల కన్నా తక్కువగా ఉందని, ముడిచమరు రేట్లు తగ్గడం డీజిల్‌ను అత్యధికంగా వినియోగించే మన దేశం లాంటి వాటికి ఎంతగానో తోడ్పడుతుందని సోమవారం ఫిక్కీ నిర్వహించిన బ్యాంకర్ల సదస్సులో ఆయన తెలిపారు.

Diesel Price

ముడి చమురు రేటు తగ్గడమంటే, కరెంటు ఖాతా లోటు తగ్గడం, చమురు సబ్సిడీలు తగ్గడం, తక్కువ ద్రవ్యోల్బణంగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరలో డీజిల్‌ పై సబ్సిడీలు ఎత్తివేయాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర గతడచిన జూన్‌ తరువాత బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోవడం ఇదే ప్రథమం.

గడచిన సోమవారం నాటికి ముడి చమురు ధర 14 నెలల కనిష్ఠంగా బ్యారెల్‌కు 99.59 డాలర్లు పలికింది. చైనా నుంచి దిగుమతులు తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

Most Read Articles

English summary
Government must take advantage of the low oil prices to deregulate diesel, RBI governor Raghuram Rajan said on Monday. Brent crude, a benchmark for Asian and Indian buyers, has fallen 14 per cent since June to $96.38 per barrel.
Story first published: Tuesday, September 16, 2014, 10:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X