ఐదేళ్ల తర్వాత తగ్గనున్న డీజిల్ ధర!

By Ravi

దాదాపు ఐదేళ్ల తర్వాత డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. చమురు కంపెనీలు గడచిన కొంత కాలంగా, ప్రతినెలా డీజిల్ ధరను 50 పైసల చొప్పున పెంచుకుంటూ రావటం వలన డీజిల్‌ను విక్రయించడంపై వచ్చే నష్టాలు తగ్గిపోయి, లాభాలు రావటం మొదలు పెట్టాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో, లీటరు డీజిల్ విక్రయంపై చమురు కంపెనీల లాభం రూ.1.90కి పెరిగిపోయింది. సెప్టెంబర్‌ రెండవ వారం నాటికి ఈ లాభం 35 పైసలుగా ఉండేది. వాస్తవానికి గత నెలలోనే డీజిల్‌ ధరలు తగ్గించాల్సి ఉన్నప్పటికీ, చమురు మంత్రిత్వ శాఖ మాత్రం వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది.

కాగా.. డీజిల్ విక్రయంపై నష్టాలు తొలగి, లాభాలు వస్తున్న నేపథ్యంలో, లీటర్ డీజిల్ ధరను ఒక్క రూపాయి మేర తగ్గించాలనే అంశాన్ని చమురు కంపెనీలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే గనుక జరిగితే, గత ఐదేళ్లలో డీజిల్ ధర తగ్గటం ఇదే తొలిసారి కానుంది.

గడచిన జనవరి 29, 2009వ తేదిన లీటర్ డీజిల్ ధర 1.75 తగ్గింది. అంతర్జాతీయ దిగుమతి, రిటైల్ ధరకు ప్రస్తుత వ్యత్యాసం భారీగా ఉండటంతో చమురు ధరను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Most Read Articles

English summary
Diesel price is likely to be cut by about Re 1 per litre, the first reduction in rates in over five years, while petrol price may be slashed by Rs. 1.75. Diesel rates were last cut on January 29, 2009 when they were reduced by Rs. 2 a litre to Rs. 30.86.
Story first published: Saturday, October 4, 2014, 9:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X