లాంబోర్గినీ, ఫెరారీ కార్లలో మెక్‌డొనాల్డ్స్ ఫాస్ట్‌ఫుడ్ డెలివరీ!

By Ravi

ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ ఇకపై తమ ఫాస్ట్‌ఫుడ్‌ని మరింత ఫాస్ట్‌గా కస్టమర్లకు చేరయవేయనుంది. ఆస్ట్రేలియాలోని ఓ మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్ తమ కస్టమర్లకు ఫెరారీ, లాంబోర్గినీ వంటి సూపర్‌కార్లలో వచ్చిన ఫాస్ట్‌ఫుడ్‌ని డెలివరీ చేస్తోంది.

మెల్‌బోర్న్‌లోని ఓ మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్ బోరింగ్ స్కూటర్లను పక్కన పెట్టి ఫెరారీ ఎఫ్430 స్పైడర్, లాంబోర్గినీ సూపర్‌కార్లను ప్రత్యేకంగా మెక్‌డొనాల్డ్ థీమ్‌లో ఎక్స్టీరియర్లను పెయింట్ చేసి, 'మెక్‌డెలివరీ' పేరిట ఈ సూపర్‌కార్లలో నేరుగా కస్టమర్లకు డెలివరీ అందజేస్తోంది.

అయితే, ఇదంతా మార్కెటింగ్ స్టంట్‌లో ఓ భాగమని, గడచిన త్రైమాసికంలో కంపెనీ లాభాలు ఏకంగా 30 శాతం తగ్గిపోవటంతో లాభాలను పెంచుకునేందుకు కంపెనీ ఈ కొత్త ట్రిక్స్ పాటిస్తోందని అక్కడి వారు చెప్పుకుంటున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది.

Fast Food Delivered In Ferrari

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఉన్న మరో 20 రెస్టారెంట్లు కూడా రానున్న నెలల్లో హోం డెలివరీని ప్రారంభించనున్నారు. అయితే, వారు కూడా స్పోర్ట్స్ కార్లను ఉపయోగిస్తారా, లేక వేరే ఇతర మార్గంలో డెలివరీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

అయితే, ఇలాంటి సూపర్‌కార్ల ద్వారా మీరు డెలివరీ పొందాలనుకుంటే, మీరు ముందుగా కనీసం 21 డాలర్ల విలువైన ఫుడ్‌ని ఆర్డర్ చేయాలి. ఆ తర్వాత్ ఫుడ్ ఇంటికి వచ్చాక 4.35 డాలర్ల మొత్తాన్ని డెలివరీ చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది.

అమెరికాకు చెందిన పిజ్జా తయారీ కంపెనీ డొమినోస్, మరో అడుగు ముందుకు వేసి మానవరహిత విమానం (డ్రోన్) ద్వారా వేడి వేడి పిజ్జాలను కస్టమర్ల ఇంటికి అందజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసినదే.

Most Read Articles

English summary
One of the McDonald outlet in Australia is using Lamborghini and Ferrari supercars to deliver the hot food to their customers The Daily Mail reports.
Story first published: Thursday, October 30, 2014, 17:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X