ఎయిర్‌బ్యాగ్ సమస్య: 9000 నిస్సాన్ మైక్రా, సన్నీ కార్ల రీకాల్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా భారత మార్కెట్లో తయారు చేసిన సుమారు 9000 యూనిట్ల మైక్రా హ్యాచ్‌బ్యాక్, సన్నీ సెడాన్ కార్లను రీకాల్ చేయనుంది. ఈ కార్లలో ఉపయోగించిన ఎయిర్‌బ్యాగ్‌ల సమస్య కారణంగానే వీటిని రీకాల్ చేయనున్నారు.

ఈ కార్లలో ఉపయోగించిన ఎయిర్‌బ్యాగ్‌లను టకటా కార్పోరేషన్ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. ఇదే సమస్య కారణంగా నిస్సాన్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2.6 లక్షల కార్లను రీకాల్ చేయనుంది.


ఈ కార్లన్నీ 2008 నుంచి 2012 మధ్య కాలంలో తయారైనవని నిస్సాన్ పేర్కొంది. ప్రస్తుతం నిస్సాన్ ఈ లోపాలు కలిగిన కార్ల యజమానులను గుర్తించే పనిలో ఉందని, కస్టమర్లకు సమాచారం అందిన తర్వాత తమ సమీపంలోని డీలరును సంప్రదిస్తే, ఉచితంగా డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్‌ను రీప్లేస్ చేసిస్తారని నిస్సాన్ అధికారి ఒకరు వెల్లడించారు.

ఇండియాలో తయారై, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అయిన కార్లకు కూడా ఈ రీకాల్ వర్తించనుంది. నిస్సాన్ గ్లోబల్ రీకాల్ విషయానికి వస్తే.. ఎక్కువగా జపాన్‌లో అమ్ముడుపోయే నిస్సాన్ క్యూబ్ మోడల్ (1,04,905 కార్లు), యూరప్‌లో 30,000 కార్లు, చైనాలో 11,000 కార్లు ఈ రీకాల్‌కు వర్తించనున్నాయి.

Nissan Cube

టకటా కార్పోరేషన్ ఎయిర్‌బ్యాగ్‌లను ఉపయోగించిన అనేక ఇతర కార్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను రీకాల్ చేస్తున్నాయి. యూఎస్ సేఫ్టీ రెగ్యులేటర్స్ పేర్కొన్న సమాచారం ప్రకారం, మొత్తం 10 కార్ కంపెనీలు టకటా ఎయిర్‌బ్యాగ్‌లను ఉపయోగించాయి.

ఈ పది కంపెనీలు కలిసి సుమారు 78 లక్షల కార్లను రీకాల్ చేయనున్నాయి. టొయోటా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 36 లక్షల కార్లను రీకాల్ చేయగా, హోండా 20 లక్షలు, బిఎమ్‌డబ్ల్యూ 26 లక్షల కార్లను రీకాల్ చేసింది.

Most Read Articles

English summary
Nissan India is recalling around 9,000 units of the Micra hatchback and Sunny sedans to replace defective airbags made by component vendor Takata Corp that are prone to failure due to corrosion and could spray shrapnel to passengers upon deployment.
Story first published: Saturday, October 25, 2014, 10:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X