ఫెరారీ బాస్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఫియట్

By Ravi

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ ఫెరారీ, ప్రస్తుత చైర్మన్ లుకా కార్డెరో డి మోంటెజ్‌మోలో అక్టోబర్ 13, 2014వ తేదీ నుంచి తన పదవికి స్వస్తి పలకనున్న సంగతి తెలిసినదే. ఆయన ఉన్నపళంగా చైర్మన్ పదవికి రాజీనామా చేయటంతో, ఫెరారీ మాతృ సంస్థ ఫియట్ మోంటెజ్‌మోలోకు ఫైనల్ సెటిల్‌మెంట్‌గా 27 మిలియన్ యూరోలను చెల్లించనుంది.

ఈ మొత్తం లుకా కార్డెరో డి మోంటెజ్‌మోలో వార్షిక వేతనాని కన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 67వ సంవత్సరంలో ఉన్న లుకా కార్డెరో డి మోంటెజ్‌మోలో 1991వ సంవత్సరం నుంచి 23 ఏళ్ల పాటు ఫెరారీ సంస్థకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

Ferrari Chairman

ఫెరారీ సంస్థలో 23 ఏళ్ల కాలం పాటు సేవలందించినందుకు గాను మోంటెజ్‌మోలోకు మరో 20 ఏళ్ల పాటు మొత్తంగా 13.25 మిలియన్ యూరోలను ఫియట్ చెల్లించనుంది. అంతేకాకుండా, ఫియట్ కంపెనీకి పోటీగా 2017 వరకు వేరే ఏ ఇతర కంపెనీలో చేరకుండా ఉండేందుకు కూడా ఫియట్ అదనంగా మరో 13.25 మిలియన్ యూరోలను చెల్లించేందుకు సిద్ధమైంది.

కాగా.. ఫెరారీ కొత్త చైర్మన్‌గా లుకా కార్డెరో డి మోంటెజ్‌మోలో స్థానంలో ఫియట్ సిఈఓ సెర్గియో మెర్చియోన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫెరారీ చైర్మన్ పదవి నుంచి లుకా డి మోంటెజ్‌మోలో తప్పుకోవటానికి గల అసలైన కారణం తెలియకపోయినప్పటికీ, ఫెరారీ రోడ్ కార్ డివిజన్ భవిష్యత్తు గురించి అలాగే ఇటీవలి కాలంలో ఫెరారీ ఎఫ్1 టీమ్ పెర్ఫార్మెన్స్ సమస్యల గురించి మోంటెజ్‌మోలో మరియు మార్చియోన్‌ల మధ్య తలెత్తిన వివాదాలే ఇందుకు కారణమనే పుకార్లు వినిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
The outgoing Ferrari Chairman, Luca Cordero di Montezemolo, will be paid 27 million euros, five times his annual pay as severance package by the parent company Fiat.
Story first published: Friday, September 12, 2014, 15:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X