మారుతి సుజుకి కార్లలో ఫియట్ ఇంజన్ల కొనసాగింపు

By Ravi

మారుతి సుజుకి కార్లలో ఉపయోగించే పెట్రోల్ ఇంజన్లను తమ మాతృ సంస్థ సుజుకి సహకారంతో భారత్‌లోనే తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. కానీ, స్విఫ్ట్, డిజైర్, రిట్జ్, ఎర్టిగా మొదలైన మోడళ్లలో ఉపయోగించే డీజిల్ ఇంజన్లను మాత్రం కంపెనీ ఫియట్ నుంచి కొనుగోలు చేస్తోంది.

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో మీ కారులో చెక్ చేయాల్సిన టాప్ 15 అంశాలు

అయితే, మారుతి సుజుకి - ఫియట్‌ల మధ్య కుదిరిన ఈ ఇంజన్ సరఫరా ఒప్పందం మరికొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో, ఇరు కంపెనీలు తమ ఒప్పందాన్ని మరికొంత కాలం పొడగించుకున్నాయి. తాజా రెన్యువల్ ప్రకారం, రానున్న మూడేళ్ల పాటు ఫియట్ తమ డీజిల్ ఇంజన్లను మారుతి సుజుకి ఇండియాకు సరఫరా చేయనుంది.

Fiat Engines To Power Maruti Suzuki

ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫియట్ భారత్‌లో డీజిల్ ఇంజన్లను అసెంబ్లింగ్ చేసి మారుతి సుజుకితో పాటుగా పలు ఇతర కంపెనీలకు విక్రయిస్తోంది. మారుతి-ఫియట్‌ల మధ్య ఒప్పందం 2015 నాటికి ముగియనుంది. అయితే, మారుతి డీజిల్ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని మరికొంత కాలానికి పొడగించారు.

ఇది కూడా చదవండి: బేసిక్ రోడ్ సెన్స్

వాస్తవానికి మారుతి సుజుకి స్వయంగా డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్నప్పటికీ, ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావటానికి మరికొంత కాలం పట్టే ఆస్కారం ఉంది. అప్పటి వరకు ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని మారుతి సుజుకి భావిస్తున్నట్లు సమాచారం. మారుతి సుజుకి ఇండియా సంవత్సరానికి లక్ష డీజిల్ ఇంజన్లను ఫియట్ నుంచి కొనుగోలు చేస్తోంది.

Most Read Articles

English summary
India's largest manufacturer of four wheeler's Maruti Suzuki currently manufacturers its engines at its facility in Manesar. They currently assemble its diesel mill at its Gurgaon facility. They will be preparing its own 800cc diesel mill in India for India.
Story first published: Friday, July 18, 2014, 12:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X