ఫియట్ ఇండియా నుంచి ఉచిత వింటర్ చెకప్ క్యాంప్స్

By Ravi

శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో, ఫియట్ వాహనాలను ఉపయోగించే కస్టమర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరాదనే ఉద్దేశ్యంతో, ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫియట్ ఇండియా రేపటి నుంచి ఉచిత వింటర్ చెకప్ క్యాంపులను నిర్వహించనుంది.

ఫియట్ ఫ్రీ వింటర్ చెకప్ క్యాంప్స్ అక్టోబర్ 17, 2014వ తేదీ నుండి ప్రారంభమై అక్టోబర్ 19, 2014 వరకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని అధీకృత ఫియట్ ఇండియా డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లలో ఈ ఉచిత వింటర్ చెకప్ క్యాంప్స్ అందుబాటులో ఉంటాయి.

ఈ క్యాంప్ గురించి ఫియట్ క్రైస్లర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ నాగేష్ బసవనహల్లి మాట్లాడుతూ.. తమ ప్రస్తుత మరియు భావి కస్టమర్లను చేరుకునేందుకు చేసే తమ నిరంతరాయ ప్రయత్నాల్లో భాగంగానే ఈ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామని, దేశవ్యాప్తంగా తాము నిర్వహిస్తున్న ఈ క్యాంప్, ఆఫ్టర్ సేల్స్ సర్వీసుల విషయంలో ఫియట్ యొక్క ప్రపంచస్థాయి ప్రమాణాలను ప్రతిభింభింపజేస్తుందని అన్నారు.

Fiat India Sets Up Free Winter Checkup Camps

మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ చెకప్ క్యాంప్ గురించి ఫియట్ ఎక్స్‌క్లూజివ్ డీలర్‌షిప్‌లు తమ కస్టమర్లను ఫోన్, ఈ-మెయిల్, మెసేజ్‌ల ద్వారా సంప్రదిస్తుందని, ఈ సర్వీస్ క్యాంప్‌కు ఫియట్ కస్టమర్లు తీసుకువచ్చే వాహనాలకు ఉచితంగా 52 పాయింట్ చెకప్ చేసి, కారులో విజిబిలిటీ, హీటింగ్, కూలింగ్ సిస్టమ్‌లను కూడా తనిఖీ చేస్తామని కంపెనీ పేర్కొంది.

ఫ్రంట్ విండ్‌షీల్డ్ స్క్రీన్ క్లీనింగ్ సొల్యూషన్‌ను కాంప్లిమెంటరీగా ఆఫర్ చేయటంతో పాటుగా లేబర్ చార్జీలపై 10 శాతం తగ్గింపు, మెకానికల్ రిపేర్ వర్క్స్‌పై 10 శాతం తగ్గింపును కూడా ఆఫర్ చేయనున్నారు. ఈ క్యాంప్ సమయంలో విచ్చేసే కస్టమర్లు కొత్తగా విడుదలైన ఫియట్ పుంటో ఇవో హ్యాచ్‌బ్యాక్‌ను అలాగే మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఫియట్ అవెంచూరాను కూడా టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని పొందవచ్చు. మరింత సమాచారం కోసం మీ సమీపంలోని ఫియట్ ఇండియా డీలరును సంప్రదించండి.

Most Read Articles

English summary
Fiat India will set up Winter Checkup Camps at its exclusive dealerships across India that will start on 17th October and end on 19th October. This move is in continuation with FIAT’s strategy to reach out to a wide base of FIAT customers located across India and reiterate its commitment to the Indian market. 
Story first published: Thursday, October 16, 2014, 17:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X