మొట్టమొదటి ఫెరారీ 485 స్పెషాలే ఏ వేలం; రూ.5.5 కోట్లు

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫెరారీ, అమెరికాలో తమ 60వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంది. అమెరికాలోని పాపులర్ బెవర్లే హిల్స్ ప్రాంతంలో ఈ వేడుకను జరుపుకుంది. ఈ సందర్భంగా కంపెనీ ఓ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ (10 యూనిట్లు మాత్రమే) ఫెరారీ ఎఫ్60అమెరికా స్పోర్ట్స్ కారును కూడా ఆవిష్కరించింది.

అంతేకాకుండా.. ఫెరారీ తయారు చేసిన మొట్టమొదటి 'ఫెరారీ 458 స్పెషాలే ఏ' (Ferrari 458 Speciale A) కారును కూడా ఛారిటీ కోసం వేలానికి ఉంచింది. కేవలం 499 యూనిట్ల ఫెరారీ 458 స్పెషాలే ఏ కార్లను మాత్రమే తయారు చేయనున్నారు. వాటిలో ఇది మొట్టమొదటిది కావటం విశేషం. వేలంలో ఈ కారు 5.5 కోట్ల వెల పలికింది.


ఈ వేలాన్ని 'డేబ్రేక్' యొక్క అమెరికన్ విభాగం నిర్వహించింది, అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధులను నయం చేయటంలో ఈ చారిటీ పరిశోధనలు చేస్తుంది. గుడింగ్ అండ్ కంపెనీ కార్ వేలం సంస్థ ప్రెసిడెంట్ డేవిడ్ గుడింగ్ ఈ కారును వేలం ద్వారా విక్రయించారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని డేబ్రేక్ చారిటీకి అందజేయనున్నారు.

ఫెరారీ 458 స్పెషాలేకు కన్వర్టిబల్ వెర్షనే ఈ ఫెరారీ ఫెరారీ 458 స్పెషాలే ఏ. ఇందులో రీట్రాకబల్ హార్డ్ టాప్ రూఫ్ ఉంటుంది, ఇది కేవలం 14 సెకండ్ల వ్యవధిలోనే ఓపెన్/క్లోజ్ అవుతుంది. ఈ మొట్టమొదటి ప్రొడక్షన్ వెర్షన్‌లో 5-స్పోక్ ఫోర్జ్డ్ గ్రిగియో కోర్సా వీల్స్, ట్రిపుల్ లేయర్ యల్లో కలర్ బాడీ పెయింట్‌ను మరియు బానెట్ నుంచి రియర్ వరకు వైట్ అండ్ బ్లూ కలర్ స్ట్రైప్ ఉంటుంది.

First Ferrari 458 Speciale A Auction

కారు లోపలి వైపున డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యానెళ్లను బ్లూ కలర్ కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. సీట్లను 3డి స్టిచింగ్ మరియు 3డి టెక్నికల్ ఫ్యాబ్రిక్‌తో అల్కాంటరాలో వ్రాప్ చేశారు.

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. ఫెరారీ 458 స్పెషాలే ఏ కారులో 4.5 లీటర్, వి8, న్యాచరల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9000 ఆర్‌పిఎమ్ వద్ద 605 పిఎస్‌ల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 540 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

Most Read Articles

English summary
Ferrari has celebrated its 60th anniversary in the United States at Beverly Hills, which included the official reveal of the F60 America and the auction of first Ferrari 458 Speciale A. This first car is sold at a whopping Rs 5.5 crore in an auction.
Story first published: Wednesday, October 15, 2014, 15:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X