బ్యాంకాక్ మోటార్ షోలో ఫోర్డ్ ఎవరెస్ట్ (ఎండీవర్) ఆవిష్కరణ

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్స్‌కు చెందిన ఆస్ట్రేలియా విభాగం, ఫోర్డ్ ఆస్ట్రేలియా గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో 'ఫోర్డ్ ఎవరెస్ట్' (ప్రస్తుత ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీకి రీప్లేస్డ్ వెర్షన్) ఎస్‌యూవీని ఫొటోల రూపంలో ఆవిష్కరించిన సంగతి తెలిసనదే. కాగా.. ఇప్పుడు ఫోర్డ్ థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 2014 బ్యాంకాక్ మోటార్ షోలో తొలిసారిగా ఈ మోడల్‌ను ప్రజల ముందుకు తీసుకువచ్చింది.

ఫోర్డ్ ఎవరెస్ట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని స్థానికంగానే డిజైన్ చేసి, అభివృద్ధి చేశారు. ప్రత్యేకించి ఆసియా మార్కెట్లను (భారత్‌తో కలిపి) దృష్టిలో ఉంచుకొని ఈ మోడల్‌ను తీర్చిదిద్దారు. ఫోర్డ్ ఎవరెస్ట్ కాన్సెప్ట్ ఈ ఏడాదిలోనే ఉత్పత్తి దశకు చేరుకోనుంది. ఇది 2015 ఫోర్డ్ ఎండీవర్‌గా భారత మార్కెట్లో విడుదల కానుంది. ప్రస్తుత ఎండీవర్‌తో పోల్చుకుంటే, ఇది ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది.

Ford Everest Concept

ఫోర్డ్ ఎవరెస్ట్ కాన్సెప్ట్ (లేదా నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఎండీవర్)లో 2.2 లీటర్, 3.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. అలాగే ఇందులో 2.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను కూడా ఫోర్డ్ పరిచయం చేసే ఆస్కారం ఉంది.

ఫోర్డ్ ప్రస్తుత డిజైన్ ల్యాంగ్వేజ్‌ను ప్రతిభింభింప జేసే ట్రాపేజోయిడల్ క్రోమ్ గ్రిల్ (ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలో చూసినట్లుగా) కనిపిస్తుంది. ఈ 2015 ఫోర్డ్ ఎండీవర్ భారత మార్కెట్లోని టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఫోర్డ్ ఎవరెస్ట్ కాన్సెప్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ford Everest Concept (the next generation Ford Endeavour), first revealed in August last year, has made its public debut at the 2014 Bangkok International Motor Show, in Thailand, in a "Sunset Flare" orange colour.
Story first published: Wednesday, March 26, 2014, 18:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X