ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగింది!

By Ravi

ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ మోడల్ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్' కాంపాక్ట్ ఎస్‌యూవీకి గిరాకీ నానాటికీ అధికమవుతోంది. దీనికి తోడు కంపెనీ ఉత్పత్తి చేస్తున్న సగటున ప్రతి ఐదు యూనిట్ల ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలలో ఒకదానిని విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో, భారతీయ వినియోగదారులు ఈ బుజ్జి ఎస్‌యూవీ కోసం బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విషయంలో ఉత్పత్తికి మించిన డిమాండ్ నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫోర్డ్ ఇండియా పూర్తిగా భారత మార్కెట్‌పై దృష్టి సారిస్తేనే, ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడం కష్టం. అలాంటిది, ఫోర్డ్ ఇటు ఎగుమతులపై అటు దేశీయ డిమాండ్‌పై ఏకకాలంలో దృష్టి పెట్టడంతో ఈకోస్పోర్ట్ ఇండియన్ కస్టమర్స్ ఈ విషయంలో బలవంతంగా తమ మనస్సును మార్చుకోవాల్సి వస్తోంది.

గడచిన సంవత్సరం జూన్ నెలలో విడుదలైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అశేషమైన ప్రజాదరణను సొంతం చేసుకుంది. విడుదలైన కొద్దివారాల్లోనే వేల సంఖ్యలో బుకింగ్‌లు వచ్చిపడ్డాయి. మరోవైపు అదే సమయంలో డీజిల్ వెర్షన్‌లో గ్లోప్లగ్ సమస్యతో ఉత్పత్తికి అంతరాయం కలగటం, ఈకోబూస్ట్ వేరియంట్ ఉత్పత్తి మితంగా ఉండటం వంటి అనేక అంశాల వలన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్ వేరియంట్‌ను బట్టి 6 నెలల నుంచి 9 నెలల వరకు పెరిగింది.

Ford EcoSport

ఒకానొక సమయంలో ఫోర్డ్ ఇండియా డీలర్లు ఈ మోడల్ కోసం బుకింగ్‌లను స్వీకరించడాన్ని కూడా నిలిపివేశారు. తాజా సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఇండియా డీలర్లు ఈకోస్పోర్ట్ కోసం అధిక కాలం వేచి ఉన్న కస్టమర్లను తమ ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకోమని లేదా కంపెనీ అందిస్తున్న ఇతర ఐదు మోడళ్లలో దేనినైనా ఎంచుకోవాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ప్రపంచం మొత్తంలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని నాలుగు దేశాల్లో మాత్రమే తయారు చేస్తున్నారు. అందులో మనదేశం కూడా ఒకటి (మిగిలినవి బ్రెజిల్, చైనా, థాయ్‌లాండ్). భారత్ నుంచి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎగుమతులు తప్పనిసరి చేయటానికి కూడా ఇదొక కారణంగా చెప్పవచ్చు. మరోవైపు ఈకోస్పోర్ట్ భారత్‌లో విడుదలైన తర్వాత దీని దర రెండు సార్లు (11 శాతం) పెరిగింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కస్టమర్లు కూడా తమ మనస్సు మార్చుకొని, ఈకోస్పోర్ట్ స్థానంలో వేరే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.

Most Read Articles

English summary
Ford has reportedly extended the waiting period for its best-selling SUV EcoSport in India, due to its unprecedented demand.
Story first published: Friday, January 17, 2014, 17:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X