ఫోర్డ్ నుంచి ఇన్నోవేటివ్ మొబిలిటీ చాలెంజ్ సిరీస్

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ 'ఇన్నోవేటివ్ మొబిలిటీ చాలెంజ్ సిరీస్' పేరిట ఓ సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ప్రపంచంలో మొత్తం 8 ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. భారతదేశంలో ఇది ఢిల్లీ, చెన్నై, ముంబై నగరాల్లో జరగనుంది.

లిస్బన్, పోర్చుగల్, లాస్ ఏంజిల్స్, యునైటెడ్ స్టేట్స్, జాహన్స్‌బర్గ్, సౌత్ ఆఫ్రికా, షాంగై, చైనా, అర్జెంటీనా దేశాల్లో కూడా ఫోర్డ్ తమ మొబిలిటీ చాలెంజ్ సిరీస్‌ను నిర్వహించనుంది. ఫోర్డ్ మొబిలిటీ చాలెంజ్ సిరీస్ జులై 15, 2014 నుండి ఈ ఎనిమిది దేశాలలో ప్రారంభం కానుంది.

ఈ ప్రోగ్రామ్ గురించి ఫోర్డ్ ఛీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్) పౌల్ మాస్కారెనాస్ వివరిస్తూ.. భవిష్యత్తు కోసం తెలివైన మరియు మరింత సమర్థవంతమైన రవాణా నెట్‌వర్క్‌ను కొనుగొనేందుకు స్థానికులతో కలిసి పనిచేసేందుకు ఈ ప్రోగ్రామ్‌ను క్రియేట్ చేశామని చెప్పారు.


ఈ కాంపిటీషన్‌లో నెగ్గిన వారికి ఫోర్డ్ 30,000 డాలర్లను బహుకరించనుంది. ఇన్నోవేటివ్ మొబిలిటీ ఛాలెంజ్ సిరీస్ యొక్క విజేతను గుర్తించేందుకు మూడు పోటీలు ఉంటాయి. ప్రతి విజేతకు మొత్తం గ్రాండ్ ప్రైజ్ 15,000 డాలర్లు. ఇతర బహుమతులను కూడా ఫోర్డ్ త్వరలోనే వెల్లడించనుంది.

ఇది కూడా చదవండి: కాళ్ల క్రింద చక్రాలు.. రాకెట్ స్కేట్స్..

ఈ పోటీకి సంబంధించిన మరింత సమాచారం మరియు ఇందులో ఎలా పాల్గొనాలో తదితర వివరాలను తెలుసుకునేందుకు fordsvl.com/innovatemobility వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. విభిన్ని ప్రాంతాలలో విభిన్న మొబిలిటీ చాలెంజ్ సిరీస్‌లు ఉంటాయి.

చెన్నై రీజియన్‌లో ఆరోగ్య సేవలకు సంబంధించిన చాలెంజ్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మారుమూల ప్రాంతాలను కనెక్ట్ చేసేలా ఈ చాలెంజ్ ఉంటుంది. దీనిని 'సమ్మర్ ఎమ్‌హెల్త్ చాలెంజ్' అని పిలుస్తారు, దీనికి సంబంధించిన ప్రాజెక్టులను జులై 30 నుంచి అక్టోబర్ 20 మధ్యలో సమర్పించాల్సి ఉంటుంది.

Innovate Mobility Challenge Series

ఢిల్లీ రీజియన్‌లోని ఛాలెంజ్‌ను 'సమ్మర్ గోల్డెన్ అవర్ చాలెంజ్' అని పిలుస్తారు. అత్యవర/క్లిష్ట పరిస్థితుల్లో వైద్య సాయం అందించేందు పట్టే సమయాన్ని తగ్గించేందుకు వారు ఓ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేస్తారు. ఢిల్లీ వాసులు కూడా తమ ప్రాజెక్టును జులై 30 నుంచి అక్టోబర్ 30 మధ్యలో సమర్పించాల్సి ఉంటుంది.

ముంబై రీజియన్‌లోని చాలెంజ్‌ను 'మాన్‌సూన్ యాప్ డౌన్‌పౌర్ చాలెంజ్' అని పిలుస్తారు. వర్షాకాలంలో రవణా వ్యవస్థను మెరుగు పరచేదిశగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టులను జులై 15 నుంచి అక్టోబర్ 14 మధ్యలో సమర్పించాల్సి ఉంటుంది. వచ్చే నవంబర్ నెలలో ఫోర్డ్ భారతదేశంలో విజేతలను ప్రకటిస్తుంది.

కారుపై నుంచి జంప్ చేసే వీడియోని చూశారా..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/ZAmq0sxLEDM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Ford has announced the launch of its 'Innovate Mobility Challenge Series'. The American based automobile manufacturer has launched the challenge series in eight parts of the world. In India the series will commence in Chennai, Delhi, Mumbai.&#13;
Story first published: Wednesday, July 16, 2014, 12:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X