మారుతి ఎర్టిగాకు సవాల్ విసిరేందుకు వస్తున్న ఫోర్డ్ ఎమ్‌పివి

By Ravi

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ విజయంతో జోరుమీదున్న అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా, ఇప్పుడు దేశీయ విపణిలో యుటిలిటీ వాహన విభాగంలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధమైంది.

ఇటీవలే ముగిసిన ఆటో ఎక్స్‌పోలో ఫోర్డ్ ఇండియా ఆవిష్కరించిన ఫోర్డ్ ఫిగో సెడాన్ (అలియాస్ ఫోర్డ్ కా కాన్సెప్ట్)ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ కాంపాక్ట్ ఎ‌పివిని అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. అయితే, దీని పేరు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఫోర్డ్ ఫిగో సెడాన్‌లో ఉపయోగించనున్న ఇంజన్లనే కొత్త ఫోర్డ్ ఎమ్‌పివిలోను ఉపయోగించే అవకాశం ఉంది. ఇంకా ఇందులో తమ పాపులర్ 1.0 లీటర్ ఈకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్‌ను ఆప్షన్‌ను పరిచయం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Ford Figo Sedan

ఫోర్డ్ నుంచి రానున్న ఎమ్‍‌పివిని ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న బోరింగ్ ఎమ్‌పివిల మాదిరిగా కాకుండా, ఈకోస్పోర్ట్ మాదిరిగానే మరింత స్పోర్టీగా, స్టయిలిష్‌గా డిజైన్ చేయనున్నట్లు సమాచారం.

కొత్త ఫోర్డ్ ఎమ్‌పివి 2015 చివరి నాటికి కానీ లేదా 2016 ఆరంభంలో కానీ మార్కెట్లోకి రావచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి ఎర్టిగా, షెవర్లే ఎంజాయ్ మోడళ్లతో పాటుగా త్వరలోనే మార్కెట్లోకి రానున్న హోండా మొబిలియో, హ్యుందాయ్ ఎమ్‌పివిలకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ford MPV based on Figo sedan long wheelbase to be launched in India in 2016. Ford MPV launch in India in 2016.
Story first published: Tuesday, February 25, 2014, 18:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X