పాదచారులు కనిపిస్తే బ్రేక్ వేస్తుంది; ఫోర్డ్ కొత్త సేఫ్టీ ఫీచర్

By Ravi

ఆటోమొబైల్ టెక్నాలజీ నానాటికీ విస్తరిస్తోంది. ప్రత్యేకించి సేఫ్టీ ఫీచర్ల విషయంలో, ఆటోమొబైల్ రంగంలో రోజుకో కొత్త ఫీచర్ పుట్టుకొస్తోంది. తాజాగా, అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ ఓ సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. అయితే, ఈ సేఫ్టీ ఫీచర్ కారులో ఉండే ప్రయాణీకులను రక్షించడమే కాకుండా రోడ్డుపై వెళ్తున్న పాదచారులను కూడా రక్షిస్తుంది.

ఏమిటా సిస్టమ్, అదెలా పనిచేస్తుంది?
పాదచారులను (పెడస్ట్రెయిన్స్) గుర్తించే 'ప్రీ-కొల్లయిజన్ అసిస్ట్ సిస్టమ్'ను ఫోర్డ్ తయారు చేసింది. ఈ సిస్టమ్ రోడ్డును దాటుతున్న లేదా రోడ్డుపై అడ్డంగా వెళ్తున్న పాదచారులను గుర్తించే, ఆటోమేటిక్‌గా బ్రేక్ అప్లయ్ అయ్యేలా చేస్తుంది. రాడార్, కెమెరాల సాయంతో సేకరించిన డేటా ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీని వలన ప్రమాదాలు పూర్తిగా నిరోధించబడకపోయినప్పటికీ, ప్రమాద తీవ్రత మాత్రం ఖచ్చితంగా తగ్గుతుందని ఫోర్డ్ చెబుతోంది.


ఫ్రంట్ విండ్‌షీల్డ్‌పై ఉండే కెమెరా, బంపర్‌కు దగ్గర్లో ఉండే రాడార్‌లు రోడ్డు పరిసరాలను స్కాన్ చేసి, యాక్సిడెంట్ జరిగే రిస్క్ ఏదైనా ఉండే డ్రైవరును అప్రమత్తం చేస్తుంది. ఒకవేళ ఆ రిస్కును తప్పించడంలో డ్రైవర్ విఫలమైనా లేదా ఆ వార్నింగ్స్‌ను డ్రైవర్ పట్టించుకోకపోయినా, ఈ సిస్టమ్ జోక్యం చేసుకొని డ్రైవర్‌తో సంబంధం లేకుండానే పూర్తి ఫోర్స్‌తో ఆటోమేటిక్‌గా బ్రేక్స్ అప్లయ్ చేస్తుంది.

ఫోర్డ్ ఈ సిస్టమ్‌ను ఇప్పటికే విభిన్న పరిస్థితుల్లో వియజవంతంగా టెస్ట్ చేసింది. ఈ కొత్త టెక్నాలజీని తొలిసారిగా 2015 ఫోర్డ్ మోండియో కారులో ఆఫర్ చేయనున్నారు. ఆ తర్వాత పలు ఇతర ఫోర్డ్ మోడళ్లలో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు.

Ford Pre Collision Assist With Pedestrian Detection

ఇప్పటికే వోల్వో, టెస్లా వంటి పలు ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ తరహా పెడస్ట్రెయిన్ సేఫ్టీ టెక్నాలజీని తమ కార్లలో పరిచయం చేసిన సంగతి తెలిసినదే. భవిష్యత్తులో సురక్షితమైన రోడ్డు ప్రయాణం కోసం ఇప్పటికే అనేక ఆటోమొబైల్ దిగ్గజాలు సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయటంలో బిజీ బిజీగా ఉన్నాయి.
Most Read Articles

English summary
Ford Motor Company is rolling out a new driver-assist system that can reduce the severity of or even eliminate some frontal collisions involving vehicles and pedestrians. Pre-Collision Assist with Pedestrian Detection uses radar and camera technology to scan the roadway ahead and, if a collision risk with a vehicle or pedestrian is detected, provides a warning to the driver.
Story first published: Friday, October 24, 2014, 17:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X