ఎయిర్‌బ్యాగ్, ఫ్యూయెల్ లైన్ సమస్య; ఫోర్డ్ ఈకోస్పోర్ట్ రీకాల్

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో పలు సమస్యలు ఉన్న కారణంగా, కంపెనీ మొత్తం 20,752 యూనిట్లను రీకాల్ చేసింది. భారత మార్కెట్లో ఫోర్డ్ నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలో ఎయిర్‌బ్యాగ్, ఫ్యూయెల్ లైన్‌కి సంబంధించిన సమస్యలను సరిచేసేందుకు ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

మొత్తం 19,441 యూనిట్ల ఈకోస్పోర్ట్ టాప్-ఎండ్ టైటానియం వేరియంట్ (1.5 లీటర్ డీజిల్ లేదా 1.0 లీటర్ పెట్రోల్ ఈకోబూస్ట్)లలో ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకునేందుకు సహకరించే సీట్ బెల్ట్ సెన్సార్లను తనిఖీ చేయనున్నారు. అలాగే 2,715 యూనిట్ల పెట్రోల్ వేరియంట్లలో ఫ్యూయెల్ లైన్ తుప్పు పట్టే సమస్యను చెక్ చేయనున్నారు. ఇకపోతే మిగిలిన 1,404 యూనిట్లలో ఈ రెండు సమస్యలను చెక్ చేయనున్నారు.

Ford EcoSport Recall

జనవరి 2013 నుంచి సెప్టెంబర్ 2014 మధ్య కాలంలో తయారైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వాహనాలలో ఈ సమస్యలు ఉన్నట్లు ఫోర్డ్ ఇండియా గుర్తించింది. కస్టమర్ల భద్రతకు తాము ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని, వారి మనశ్శాంతి కోసమే ఈ రీకాల్‌ను ప్రకటించామని కంపెనీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ రీకాల్‌ను ప్రకటించారా లేక ఫోర్డ్ ఇండియానే స్వచ్ఛందంగా ఈ రీకాల్ ప్రకటించిందా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఈ రీకాల్‌కి సంబంధించి ఫోర్డ్ ఇండియా తమ కస్టమర్లను సంప్రదిస్తోంది. స్థానిక ఫోర్డ్ డీలర్లు తమ కస్టమర్లను సంప్రదించి ఈ రీకాల్ గురించి తెలియజేయనున్నారు. షోరూమ్/సర్వీస్ సెంటర్‌కు తీసుకువచ్చే వాహనాలకు ఉచితంగా సర్వీస్ చేయనున్నారు. గతంలో కూడా ఫోర్డ్ ఇండియా తమ ఈకోస్పోర్ట్ డీజిల్ మోడళ్లలో గ్లోప్లగ్ సమస్య కారణంగా రీకాల్ ప్రకటించిన సంగతి తెలిసినదే. ఆ సమయంలో 1,000 యూనిట్లను రీకాల్ చేశారు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కస్టమర్లు కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించి (https://www.india.ford.com/owner) అందులో ఫోర్డ్ ఫీల్డ్ సర్వీస్ యాక్షన్స్ అనే విభాగంలో వాహన గుర్తింపు సంఖ్య (వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ - విఐఎన్)ను నమోదు చేసి తమ కారు ఈ రీకాల్‌కు వర్తిస్తుందో లేదో తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ లేదా డ్రైవర్ సైడ్ డోరుపై ఈ విఐఎన్ సంఖ్య ముద్రించబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Ford, the American carmaker is to recall over 20,752 units of the EcoSport in India over a faulty fuel line and a claimed airbag issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X