ఢిల్లీలో నాలుగు చక్రాల ఆటోరిక్షాల ప్రవేశం

By Ravi

భారత రోడ్లపై క్వాడ్రిసైకిల్స్ ప్రవేశానికి సర్కారు పచ్చ జెండా ఊపడంతో, దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు చక్రాల ఆటోరిక్షాలు సందడి చేస్తున్నాయి.

దేశ రాజధాని నగరంలో తాము నాలుగు చక్రాల ఆటోరిక్షాలను ప్రారంభించామని, ట్రయల్ రన్‌లో భాగంగా ఇలాంటి నాలుగు చక్రాల ఆటోరిక్షాలన నిర్వహించేందుకు తాము 3-4 పర్మిట్లను ఇచ్చామని, ఇవి నాలుకు చక్రాలు కలిగి ఉన్నప్పటికీ, మూడు చక్రాల ఆటోరిక్షాల మాదిరిగానే మూడు సీట్లను కలిగి ఉంటాయని రవాణా విభాగానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Tata Magic

ప్రస్తుత మూడు చక్రాల ఆటోరిక్షాల విభాగం క్రిందనే ఈ నాలుగు చక్రాల ఆటోరిక్షాలను పరిగణిస్తున్నారు. అలాగే, ఈ నాలుగు చక్రాల ఆటోరిక్షాల కలర్ కూడా మూడు చక్రాల ఆటోరిక్షాల కలర్ మాదిరిగానే ఉంటుందని, కేవలం ముగ్గురు ప్యాసింజర్లను మాత్రమే ఈ వాహనాలలో అనుమతిస్తామని ఆయన తెలిపారు.

గడచిన 2011లో సుప్రీం కోర్టు రాజధానిలో సంచరించే ఆటోరిక్షాల సంఖ్యను 55,000 నుంచి 1,00,000 లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నగర వీధులపై దాదాపు 85,000 లకు పైగా ఆటోరిక్షాలున్నాయి.

Most Read Articles

English summary
Travelling in a three-wheeled autorickshaw may soon become "outdated" in Delhi with four-wheeled autorickshaws making a entry in the national capital.
Story first published: Monday, October 6, 2014, 10:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X