గూగుల్‌లో చేరిన మాజీ ఫోర్డ్ సీఈఓ, గూగుల్ కార్ల కోసమా?

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటాక్ కంపెనీకి గుడ్‌బై చెప్పిన మాజీ సీఈఓ అలన్ ములాలి ఇప్పుడు అంతర్జాల దిగ్గజం గూగుల్ సంస్థలో చేరారు. ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్‌కి ఇంటర్నెట్ కంపెనీ గూగుల్ పనేంటనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే సర్వత్రా ఆసక్తికర విషయంగా మారింది.

గూగుల్ ఇప్పటికే డ్రైవర్లతో పనిలేని ఆటోమేటిక్ కార్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మాజీ ఫోర్డ్ సీఈఓ అలన్ ములాలి గూగుల్ చేరడం వెనుక బలమైన కారణం ఉందనే తెలుస్తోంది. జులై 9వ అలన్ ముల్లాలి గూగుల్ సంస్థలే చేరారు.

గూగుల్ తమ డ్రైవర్‌లెస్ ప్రోటోటైప్ కారును ఆవిష్కరించిన రెండు వారల తర్వాతే ఈయన ఈ సంస్థలో చేరడం గమనార్హం. అలన్ ములాలి జులై 1, 2014న ఫోర్డ్ మోటార్ కంపెనీని వదిలిపెట్టారు. ఇప్పుడు ఫోర్డ్ సీఈఓ మార్క్ ఫీల్డ్స్ కొనసాగుతున్న విషయం తెలిసినదే.

Alan Mulally

ప్రారంభంలో భాగంగా, అలన్ ములాలి గూగుల్ ఆడిట్ కమిటీలో సేవలు అందించనున్నారు. ఇందుకు ఆయనకు జీతంగా 1 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్, 3,50,000 డాలర్లు అదనపు ఈక్విటీ అవార్డ్ 75,000 డాలర్ల నగదు మరియు ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు గూగుల్ పేర్కొంది.

అలన్ ములాలి 2006లో బోయింగ్ కంపెనీ నుంచి ఫోర్డ్ మోటార్ కంపెనీలోకి చేశారు. 68 ఏళ్ల వయస్సు కలిగిన ములాలి నష్టాల్లో ఉన్న ఫోర్డ్‌ సంస్థను, 2014లో 8 బిలియన్ అమెరికన్ డాలర్ల లాభాలను ఆర్జించే కంపెనీగా మార్చడంలో కీలకపాత్ర వహించారు.

గూగుల్ వచ్చే ఏడాదిలో 100 అటానమస్ (డ్రైవర్‌లెస్) కార్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. గూగుల్ అటానమస్ కార్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/CqSDWoAhvLU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
American auto major Ford Motor Company former president and CEO Alan Mulally has joined in Google's board of directors. The appointment of Mulally comes less than two months after Google has unveiled its self-driving car.&#13;
Story first published: Thursday, July 17, 2014, 11:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X