నేరుగా కార్లలోనే ఆండ్రాయిడ్‌ను ఆఫర్ చేయనున్న గూగుల్!

By Ravi

గూగుల్ ఇప్పుడు తమ దృష్టిని స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి ఆటోమొబైల్స్ వైపు మళ్లించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే స్ట్రీట్ వ్యూ, డ్రైవర్‌లెస్, ఆండ్రాయి ఆటో వంటి పలు సాంకేతికతలను అందుబాటులోకి తీసుకువచ్చిన అంతర్జాల దిగ్గజం గూగుల్, తాజాగా తమ ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్‌కు మరింత అడ్వాన్స్డ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ ఏడాది జూన్ నెలలో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ తయారు చేసిన కార్ ప్లే అనే కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు పోటీగా గూగుల్ 'ఆండ్రాయిడ్ ఆటో' (Android Auto) పేరిట కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసినదే. ఈ టెక్నాలజీలో కస్టమర్లు తప్పనిసరిగా తమ స్మార్ట్ ఫోన్‌తో ఈ సిస్టమ్‌ను కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

Google Working To Build Android Directly Into Cars

అయితే, యూజర్లు తమ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, నేరుగానే కార్లలో ఇంటర్నెట్ యాక్సిస్ చేసుకునేలో ఓ సరికొత్త ఆండ్రాయిడ్ సిస్టమ్‌ను తయారు చేస్తోంది. గూగుల్ అభివృద్ధి చేస్తున్న ఈ నెక్స్ట్ జనరేషన్ ఆండ్రాయి ఆటో సిస్టమ్‌లో కస్టమర్లు నేరుగా కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ ద్వారానే ఇంటర్నెట్‌ని పొంది మ్యూజిక్, మ్యాప్స్, యాప్స్, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, జిపిఎస్ ట్రాకింగ్ వంటి అనేక అంశాలను యాక్సిస్ చేసుకోవచ్చు. దీనిని ఆండ్రాయిడ్ ఎమ్ అని పిలువనున్నట్లు సమాచారం.
Most Read Articles

English summary
Internet giant Google is setting up its foundation to allow drivers in the near future to enjoy the infinite possibilities of accessing the internet in the car, without having to connect a smartphone to the car at all.
Story first published: Saturday, December 20, 2014, 15:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X