మైఖేల్ షుమాకర్ ప్రమాదానికి గోప్రో కెమెరానే కారణమా?

By Ravi

ఫార్ములా వన్ దిగ్గజం మైఖేల్ షుమాకర్ గడచిన సంవత్సరం డిసెంబర్ నెలలో స్కీయింగ్ చేస్తూ, ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లటం, ఇటీవలే తిరిగి కోమా నుంచి బయటకు రావటం జరిగిన సంగతి మనందరికీ తెలిసినదే. అయితే, షుమాకర్ ప్రమాదానికి సంబంధించి తాజాగా ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

మైఖేల్ షుమాకర్ ప్రమాదానికి గ్రోప్రో (GoPro) కెమెరా కారణమై ఉంటుందనే పుకార్లు ఇప్పుడు జోరందుకున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో గోప్రో సంస్థ అమ్మకాలు సుమారు 16 శాతం వరకూ పడిపోయినట్లు సమాచారం. అమెరికాకు చెందిన హై-డెఫినెషిన్ కెమెరాల తయారీ సంస్థ గోప్రోకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది.


ఫ్రెంచ్ ఎఫ్1 కామెంటేటర్ జీన్ లూయీస్ మోన్సెంట్ షుమాకర్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. అతను (షుమాకర్) క్రింద పడిపోవటం వలన బ్రెయిన్ డ్యామేజ్ కాలేదని, అతని తలపై హెల్మెట్‌కు అమర్చి ఉన్న గ్రోప్రో కెమెరా వల్లనే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువయ్యిందని వ్యాఖ్యానించారు.

గోప్రో కెమెరాలను అడ్వెంచర్లను రికార్డు చేయటంలో ఉపయోగిస్తుంటారు. స్కీయింగ్, సర్ఫింగ్, డ్రైవింగ్, అడ్వెంచర్ రైడ్, టూరింగ్ ఇలా అనేక సందర్భాలలో గోప్రో కెమెరాలను ఉపయోగిస్తారు. గోప్రో కెమెరాలు చూడటానికి చాలా చిన్నవిగా ఉన్నప్పటి స్పష్టమైన క్లారిటీతో కూడిన వీడియోలను చిత్రీకరించగలవు.

GoPro

ఈ వార్తలపై గోప్రో స్పందించింది. దీని గురించి గోప్రో ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. మోన్సెంట్ చెప్పినట్లు షుమాకర్ యాక్సిడెంట్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తాము సేకరిస్తున్నామని అన్నారు. కోమా నుంచి కోలుకున్న తర్వాత మోన్సెంట్ షుమాకర్‌ని కలిశానని, అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అతడిని ఏమీ అడగలేదని ట్వీట్ చేశారు.
Most Read Articles

English summary
GoPro, a very successful American based camera manufacturer saw its share drop by almost 16 percent after news broke that the camera was the reason the for causing a head injury during Schumacher's skiing accident.
Story first published: Wednesday, October 15, 2014, 10:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X