థాయ్‌లాండ్ మార్కెట్లో హోండా హెచ్ఆర్-వి విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా, గడచిన 2014 ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కరించిన హోండా హెచ్ఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ ఇటీవలే థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్‌ని ఇప్పటికే కొన్ని మార్కెట్లలో హోండా వెజెల్ పేరుతో విక్రయిస్తున్నారు.

కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గిరాకీ ఎక్కువగా మార్కెట్లను (ప్రత్యేకించి భారత మార్కెట్‌ను) లక్ష్యంగా చేసుకొని హోండా తమ హెచ్ఆర్-విని అభివృద్ధి చేసింది. హోండా అందిస్తున్న ఫుల్-సైజ్డ్ ఎస్‌యూవీ సిఆర్-వి నుంచి స్ఫూర్తి పొంది ఈ మోడల్‌ను డిజైన్ చేశారు.

honda cars

హోండా హెచ్ఆర్-వి త్వరలోనే యూఎస్, యూరప్ మార్కెట్లలో కూడా విడుదల కానుంది. అయితే, వీటి కన్నా ముందుగా ఈ కారును థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేశారు. థాయ్‌లాండ్‌లో దీని ధరలు రూ.16.77 లక్షల నుంచి రూ. 19.66 లక్షల మధ్యలో ఉన్నాయి.

థాయ్‌లాండ్ వెర్షన్ హోండా హెచ్ఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.8 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 139 బిహెచ్‌పిల శక్తిని, 172 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

compact suv

ప్రస్తుతానికి థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలైన హోండా హెచ్ఆర్-విలో డీజిల్ వెర్షన్ అందుబాటులో లేదు. అయితే, ఇండియన్ మార్కెట్ విషయానికి వస్తే, ఇందులో తప్పనిసరిగా డీజిల్ వెర్షన్ (1.5 లీటర్ ఐడిటెక్)ను ఆఫర్ చేసే ఆవకాశం ఉంది.

థాయ్‌లాండ్‌లో ప్రతి ఏటా 20,000 యూనిట్ల హెచ్ఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యూవీలను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇందులో 4-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో లేదు. ఈ కారులో ఏబిఎస్, ఈబిడి, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆటో హోల్డ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్‌లు స్టాండర్డ్ ఫీచర్లుగా లభ్యం కానున్నాయి.

honda car thailand

థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలైన హోండా హెచ్ఆర్-వి నెక్స్ట్ స్టాప్ బహుశా ఇండియా కావచ్చు. మన మార్కెట్లో ఇది ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో త్వరలో మహీంద్రా నుంచి రానున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలతో ఇది పోటీ పడనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Japanese carmaker Honda has launched its new Compact SUV HR-V in Thailand. Under the bonnet of Thailand's compact SUV is a 1.8-litre, four-cylinder petrol engine. It produces a maximum power output of 139 bhp, along with 172 Nm of peak torque.
Story first published: Saturday, November 22, 2014, 11:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X