ఆగస్ట్ 15న హ్యుందాయ్ ఐ20 2014 మోడల్ విడుదల

By Ravi

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20లో కంపెనీ ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను వచ్చే నెలలో మార్కెట్లో విడుదల చేయనుంది. ఆగస్ట్ 15, 2014వ తేదీన కొత్త 2014 వెర్షన్ హ్యుందాయ్ ఐ20 మోడల్ దేశీయ విపణిలోకి రాబోతోంది. ఇదివరకటి మాదిరిగానే ఈ కొత్త ఐ20 కూడా పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో లభ్యం కానుంది.

ఈ 2014 హ్యుందాయ్ ఐ20 ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లలో విడుదలైంది. మన ఇండియాలో విడుదల కానున్న కొత్త ఐ20 డిజైన్ కూడా ఇంచు మించు యూరోపియన్ మోడల్ మాదిరిగానే ఉండనుంది. మరింత ఎక్కువ క్రోమ్ గార్నిష్‌ను ఈ మోడల్‌లో చూడొచ్చు. అయితే, దీని ధర మాత్రం ఇదివరకటి వెర్షన్ కన్నా కాస్తంత ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

కొత్త 2014 హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‍‌లో రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్, కొత్త బంపర్స్, రియర్ రూఫ్ స్పాయిలర్, కొత్త ఫాగ్‌ల్యాంప్స్, సైడ్ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. మునుపటి తరం ఐ20 కన్నా కొత్త 2014 ఐ20 మరింత ప్రీమియంగాను, విలాసవంతంగాను ఉండనుంది.

2014 Hyundai i20

ఇంజన్ విషయానికి వస్తే.. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్‌ల శక్తిని, 114 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఇక డీజిల్ ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే.. ఇందులో కొత్త 1.4 లీటర్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ ఈ ఇంజన్ రిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే లభిస్తుందని సమాచారం.

ఈ కొత్త 2014 హ్యుందాయ్ ఐ20 త్వరలో మార్కెట్లోకి రానున్న ఫియచ్ పుంటో ఇవో, హోండా జాజ్ మరియు ఇటీవలే మార్కెట్లో విడుదలైన కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
South Korean car manufacturer Hyundai will be introducing a refreshed variant of its i20 hatchback. They currently plan to launch the 2014 model of i20 in India on the 15th of August, 2014. Their new hatchback will be available in both petrol as well as diesel engine options.
Story first published: Monday, July 28, 2014, 12:14 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X