హ్యుందాయ్ నుంచి 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఓ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఏ సమయంలో నైనా తమ కస్టమర్లకు సేవలు అందించేలా ఓ ప్రత్యేక 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఈ ప్రోగ్రామ్‌ను కేవలం కొత్తగా కార్లను చేసే కస్టమర్లకే కాకుండా ప్రస్తుత హ్యుందాయ్ వినియోగదారులకు కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

హ్యుందాయ్ ఈ స్పెషల్ 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం అలయంజ్ గ్లోబల్ అసిస్టెన్స్‌తో చేతులు కలిపింది. హ్యుందాయ్ వాహనం యొక్క వారంటీ పీరియడ్ పూర్తయిన తర్వాత కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. హ్యుందాయ్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ను 2010లో ప్రారంభించామని, ఏ సమయంలో నైనా సరే తమ కస్టమర్లకు అత్యవసర రోడ్‌సైడ్ మద్ధతును అందించాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు.

Hyundai 24x7 Roadside Assistance Program

ఈ ఏడాది తమ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ పాలసీని తమ దేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా విస్తరిస్తున్నామని, ఈ ప్రోగ్రామ్ క్రింద దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే హ్యుందాయ్ వెహికల్ బ్రేక్‌డౌన్ అయినా లేదా యాక్సిడెంటల్ టోయింగ్ అవసరమైనా లేదా చిన్నపాటి రిపేర్లు అవసరమైనప్పుడు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వటం మొదలైన సేవలు అందిస్తారు.

అలాగే టైర్ పంక్చర్ అయినా లేదా కీ లాక్ అయినా లేదా అత్యవసరంగా ఫ్యూయెల్ అవసరమైనా లేదా టాక్సీ సపోర్ట్ అవసరమైనా లేదా వైద్య సాయం అవసరమైన సరే ఈ ప్రోగ్రామ్ ద్వారా అందుకు కావల్సిన మద్దతును హ్యుందాయ్ ఆఫర్ చేస్తుంది. ఒక ఏడాది కవరేజ్ కోసం రూ.899, రెండేళ్ల కవరేజ్ కోసం రూ.1,499 మరియు మూడేళ్ల కవరేజ్ కోసం రూ.1,999ల మొత్తాన్ని హ్యుందాయ్ చార్జ్ చేస్తోంది.

Most Read Articles

English summary
Hyundai have now announced the introduction of an extended program for its customers. The manufacturer has associated itself with Allianz Global Assistance for a special 24x7 Roadside Assistance. This facility can be availed even post the warranty period of a particular vehicle.
Story first published: Wednesday, October 1, 2014, 13:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X