2015 హ్యుందాయ్ సొనాటా సెడాన్ ఆవిష్కరణ

By Ravi

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ సొనాటాను అప్‌గ్రేడ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే ముగిసిన 2014 జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించిన జెనిసిస్ మోడల్ నుంచి స్ఫూర్తి పొంది కంపెనీ ఓ కొత్త '2015 హ్యుందాయ్ సొనాటా'ను తయారు చేయనుంది.

ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ తమ 2015 సొనాటా సెడాన్‌కు సంబంధించి ఓ టీజర్ ఫొటోను విడుదల చేసింది. 2015 సొనాటాలో సిమిలర్ హెడ్‌లైట్స్, ఫ్రంట్ గ్రిల్‌ కనిపిస్తుంది. ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో హ్యుందాయ్ కార్ల డిజైన్ ఒకదానితో ఒకటి పోల్చిచూస్తే, అనేక డిజైన్ ఎలిమెంట్స్ సిమిలర్‌గా అనిపిస్తాయి, గతంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉండేది.


హ్యుందాయ్ తమ ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసినప్పటికీ నుంచి దాదాపు అన్ని నెక్స్ట్ జనరేషన్ కార్లలో కంపెనీ ఇదే తరహా డిజైన్‌ను అప్లయ్ చేస్తున్న సంగతి తెలిసినదే.

కొత్త 2015 హ్యుందాయ్ సొనాటాలో 1.6 లీటర్ ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇదే ఇంజన్‌ను హ్యుందాయ్ వెలాస్టర్ టర్బో కారులోను ఉపయోగిస్తున్నారు. కొత్త 2015 సొనాటా ఎక్స్టీరియర్, ఇంటీరియర్ టీజర్ ఫొటోలను కంపెనీ విడుదల చేసింది. ఈ కథనంలో వాటిని చూడొచ్చు.

Hyundai Sonata 2015 Interior

జెనిసిస్ కారులో చూసిన విధంగా ఈ కొత్త సొనాటా ఇంటీరియర్స్ కూడా ఒకే విధంగా అనిపిస్తాయి. అనేక ప్రీమియం, లగ్జరీ ఫీచర్లను ఇందులో ఆఫర్ చేయనున్నారు. హై క్వాలిటీ మెటీరియల్స్‌తో ఇంటీరియర్లను డిజైన్ చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే 2015 హ్యుందాయ్ సొనాటాను కంపెనీ కొరియాలో టెస్టింగ్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరగనున్న న్యూయార్క్ మోటార్ షోలో హ్యుందాయ్ ఈ కొత్త ప్రీమియం సెడాన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ ఇది వాణిజ్య పరంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Hyundai will be launching a refreshed version of the existing Sonata. The 2015 model borrows design cues from their Genesis model showcased at the recent Geneva Motor Show 2014.
Story first published: Saturday, March 15, 2014, 13:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X