ఈకో ఫ్రెండ్లీ వాహనాలపై ప్రభుత్వం నుంచి సబ్సిడీ!

పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే అనేక దేశాలు నడుం బిగించాయి. ప్రత్యమ్నాయ ఇంధనంతో నడిచే ఈకో ఫ్రెండ్లీ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు తాజాగా జపాన్ దేశం ప్రతి ఎలక్ట్రిక్ కారుపై రెండు మిలియన్ యెన్ (రూ.11,88,688)ల సబ్సిడీని ఇవ్వనున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి షింజో అబే ప్రకటించారు.

ఇది కూడా చదవండి: మంచి మైలేజీనిచ్చే పెట్రోల్ కార్లు

ఇప్పటికే అనేక జపనీస్ కంపెనీలు ఫ్యూయెల్ సెల్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు ముందుకు వస్తున్నాయి. టొయోటా తమ మొట్టమొదటి ఫ్యూయెల్ సెల్ వాహనాన్ని 2015 మార్చ్ నాటికి విడుదల చేయనుంది. దీని ధర సుమారు 7 మిలియన్ యెన్‌లు ఉంటుంది. అయితే, దీని ధరపై జపాన్ దేశం సుమారు 2 మిలియన్ యెన్‌లు సబ్సిడీ ఇస్తుంది కాబట్టి, ఇది కేవలం 5 మిలియన్ యెన్‌లకే మార్కెట్లో లభిస్తుంది.


మన దేశం కూడా ప్రకృతి సాన్నిహిత్యమైన ఈ వాహనాలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం సుమారు రూ.14,000 కోట్ల సబ్సిడీని సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసినదే. శిలాజ ఇంధనంతో నడిచే వాహనానికి మరియు గ్రీన్ వెహికల్ మధ్య ధర వ్యత్యాసం ఆధారంగా సబ్సిడీని ప్రతిపాదించనున్నారు. ఈ నిధుల క్లియరెన్స్ కోసం భారీ పరిశ్రమల శాఖా మంత్రి ఈ సబ్సిడీ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించినట్లు సమాచారం.

ఈ ప్రతిపాదన మేరకు పూర్తిగా బ్యాటరీతో నడిచే వాహనాలకు 35 శాతం సబ్సిడీని, కనీసం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే (కేవలం బ్యాటరీ పవర్‌తోనే) ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలకు 25 శాతం సబ్సిడీని ఆఫర్ చేయాలని యోచిస్తున్నారు. అదేవిధంగా, మైల్డ్ హైబ్రిడ్ వాహనాల కొనుగోలుపై 15 శాతం సబ్సిడీని మరియు స్ట్రాంగర్ వెర్షన్ కొనుగోలుపై 25 శాతం ప్రయోజనాన్ని కొనుగోలుదారులు పొందవచ్చు.

Electric Car

ప్రస్తుతం, మనదేశంలో లభిస్తున్న హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను చేతివేళ్లపై లెక్కపెట్టవచ్చు. టొయోట ప్రియస్, టొయోటా క్యామ్రీ వంటి హైబ్రిడ్ కార్లు, మహీంద్రా ఈ2ఓ వంటి ఎలక్ట్రిక్ కార్లు లభిస్తున్నాయి. అయితే, ఈ సబ్సిడీ ప్రతిపాదన పూర్తిస్థాయిలోకి వస్తే మరిన్ని దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు ఈ విభాగంలో ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ప్రధానంగా, దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా కూడా తమ ఉత్పత్తులలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది.

ఆటోమొబైల్ కంపెనీల ద్వారా రూట్ చేయబడనున్న ఈ సబ్సిడీ ద్వారా చాలా మంది భారతీయులు పెట్రోల్, డీజిల్ కార్లను వదిలి ఈ ప్రకృతి సాన్నిహిత్య వాహనాల వైపు మొగ్గు చూపే ఆస్కారం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధంగా 2020 వరకు వాహనాలపై సబ్సిడీ ఇచ్చుకుంటూపోతే ప్రభుత్వానికి సుమారు రూ.14,000 కోట్లు ఖర్చు అవుతుంది. కస్టమర్లు పూర్తిస్థాయిలో ఈ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపితే, ఇంధనంపై ఆరేళ్ల సమయంలో సుమారు రూ.60,000 కోట్ల ఆదా అవుతుందని అంచనా.

ఈ వీడియో చూశారా..? బికినీ బేబ్స్‌తో కెన్ బ్లాక్ జిమ్ఖానా!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/rMSL4WKT5Uc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
More and more countries are finding alternate fuels and other taking several measures to ensure a greener and sustainable future. We now hear that the Japanese Prime Minister Shinzo Abe will offer a minimum of two million Yen(INR 11,85,546) as subsidy for fuel cell vehicles.&#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X