ఇండియాలో 2016 వరకు ఫార్ములా వన్ నిర్వహించం: ఎకెల్‌స్టోన్

By Ravi

ఫార్ములా వన్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఫార్ములా వన్ మేనేజ్‌మెంట్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ బెర్నీ ఎకెల్‌స్టోన్ 2016 వరకు ఫార్ములా వన్ ఇండియాకు రాదని స్పష్టం చేశాడు. కాగా.. 2016లో ఇండియాకు వచ్చే విషయం కూడా సందేహమే, ఎఫ్1 రేసుకు సంబంధించి భారత ప్రభుత్వం అనుసరిస్తున్న పన్ను విధానంలో మార్పు రాకుంటే, అస్సలు ఇది ఎప్పటికీ ఇండియాకు రాకపోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

భారతదేశం ఎఫ్1ను ఓ క్రీడ (స్పోర్ట్)గా పరిగణించకపోవటం, ఫలితంగా మనదేశంలోకి ప్రవేశించే ఫార్ములా వన్ జట్లకు భారత ప్రభుత్వం కస్టమ్స్ రాయితీని మంజూరు చేయకపోవటం కారణంగా సదరు జట్లపై అధిక పన్ను భారం పడుతోంది. ఇదే విషయంపై ఎకెల్‌స్టోన్ గతలో ఒకానొక సందర్భంలో కూడా వెల్లడించారు. అయితే, కనీసం 2015లోనైనా ఫార్ములా వన్ ఇండియాలో జరుగుతుందనుకుంటే, అది కూడా వాయిదా పడినట్లే తెలుస్తోంది.

Indian Grand Prix

గడచిన 2011 సంవత్సరం చివర్లో భారతదేశంలోనే తొలిసారిగా ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ జరిగింది. అప్పటి వరకు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ మోటార్‌స్పోర్ట్ ఆ సంవత్సరంలో ఇండియాలోకి కూడా ప్రవేశించింది. ఈ ఫార్ములా వన్ రేస్ కోసం న్యూఢిల్లీకి సమీపంలో ఉన్న గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ రేస్ సర్క్యూట్‌ను ప్రపంచ ప్రమాణాలకు అనువుగా తీర్చిద్దారు.

ఆ తర్వాత 2012 సంవత్సరంలోను మరియు 2013వ సంవత్సరంలోను వరసుగా మూడేళ్ల పాటు ఇండియన్ గ్రాండ్ ప్రిని నిర్వహించారు. తమ ఫార్ములా వన్ క్యాలెండర్‌లో ఖచ్చితంగా వచ్చే ఏడాది వరకు ఇండియా ఉండదని, ప్రభుత్వ పన్నుల విధానంలో ఏవైనా మార్పులు వస్తే బహుశా 2016లో జరిగే అవకాశం ఉంటుందని ఎకెల్‌స్టోన్ సందేహపూర్వకంగా వెల్లడించారు. ఏదేమైనప్పటికీ, 2014లో మాత్రం ఖచ్చితంగా మనకు ఫార్ములా వన్ రేస్ కార్ల పరుగును భారత్‌లో చూసే అవకాశం లేదని అర్థమైపోయింది.

Most Read Articles

English summary
Bernie Ecclestone, president and CEO, Formula One Management has poured a bucket of cold water on Indian Formula One enthusiasts and racing fans by recently stating that the motorsports event will not return to Indian soil before 2016. Even then a return in 2016 is unlikely to happen if the problems relating to heavy taxation by the government is not sorted out.
Story first published: Tuesday, March 11, 2014, 16:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X