వోల్వో కార్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఇన్ఫోసిస్

ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో, ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌లు చేతులు కలిపాయి. ఈ మేరకు వోల్వో కార్ కార్పోరేషన్ మరియు ఇన్ఫోసిస్‌ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా, వోల్వో అంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఇన్ఫోసిస్ ఓ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనుంది.

ఇది కూడా చదవండి: 2014 వోల్వో ఎస్80 విడుదల, వివరాలు

ఇన్ఫోసిస్ గడచిన 2010 సంవత్సరం నుంచి వోల్వోకు సాఫ్ట్‌వేర్ సేవలను అందిస్తోంది. ఈ తాజా ఒప్పందంలో భాగంగా, మార్కెటింగ్ అండ్ సేల్స్, కస్టమర్ సర్వీస్, మ్యాన్యుఫాక్చరింగ్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, కార్పోరేట్ ఫంక్షన్ తదితర బహుళ డొమైన్లకు ఇన్ఫోసిస్ తమ సహకారాన్ని అందించనుంది.

Volvo and Infosys

వోల్వోతో ఏర్పరచుకున్న ఈ కొత్త ఒప్పందం గురించి ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ (మ్యాన్యుఫాక్చరింగ్, యూరప్) నితేష్ బన్సాల్ మాట్లాడుతూ.. వోల్వో కార్స్‌తో ఈ భాగస్వామ్యం నార్డిక్ రీజియన్‌పై తమ దృష్టిని ప్రతిభింభింపజేస్తుందని, ఇది స్వీడన్‌లో స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సహకరిస్తుందని తెలిపారు.
Most Read Articles

English summary
Infosys has announced that it has stuck a new deal with Volvo Car Corporation under which it will develop application software for the automaker's global operational requirements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X