ఫార్ములా వన్ ఇంజన్ ఆయిల్‌ని మన కార్లలో ఉపయోగించవచ్చా?

By Ravi

ఫార్ములా వన్ కార్లు ఇంజనీరింగ్‌కి ప్రతీక. ఫ్రంట్ అండ్ రియర్ వింగ్స్‌తో, డ్రైవర్ వెనుక భాగంలో పవర్‌ఫుల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ స్ట్రక్చరల్ సపోర్ట్ ఫ్రేమ్‌వర్క్‌లో ఓ భాగం. 2014 నాటికి ఇంజన్లను కేవలం 1.6 లీటర్ వి6 అండ్ టర్బోచార్జ్డ్‌కు మాత్రమే పరిమితం చేశారు.

ఖర్చులు తగ్గించుకునేందుకు మరియు విశ్వసనీయతను పెంచేందుకు గాను గడచిన 2009లో ఈ హై రివైవింగ్ ఇంజన్ల ఆర్‌పిఎమ్‌ను 18,000 లకు పరిమితం చేశారు. ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే, ఈ ఇంజన్లలో లూబ్రికేషన్ అనేది చాలా కీలకమైనది.

ఫార్ములా వన్ కార్లలో ఉపయోగించే ఇంజన్ ఆయిల్, నార్మల్ కార్లలో ఉపయోగించే ఇంజన్ ఆయిల్ కన్నా భిన్నమైనది. నార్మల్ కార్లలో ఈ ఎఫ్1 ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చా అని రేసింగ్ దిగ్గజం రెనో స్పోర్ట్ ఎఫ్1 మరియు ఇంజన్ ఆయిల్ కంపెనీ టోటల్ ఇంజనీర్స్‌ను అడినప్పుడు వారు ఈ విధంగా సమాధానమిచ్చారు.

Is Formula One Engine Oil Suitable For Your Car

మొట్టమొదటగా.. ఎఫ్ ఇంజన్ ఆయిల్‌ను తరచూ మారుస్తూ ఉండాలి. కేవలం 3000 కిలోమీటర్ల జీవితకాలం ఉండేలా మాత్రమే ఈ ఇంజన్ ఆయిల్స్‌ను డిజైన్ చేస్తారు. ఇంజన్ క్లీన్ చేసేందుకు మరియు ఫారిన్ బాడీస్‌ను దూరంగా ఉంచేందుకు ఉపయోగించే కొన్ని డిటర్జెంట్లు రెగ్యులర్ లూబ్రికెంట్ కన్నా ఎఫ్ లూబ్రికెంట్‌లో చాలా తక్కువగా ఉంటాయి.

నార్మల్ కార్‌లో రెగ్యులర్ ఆయిల్ చేంజ్ ఇంటర్వెల్స్ సమయంలో సమర్థవంతమైన ప్రొటెక్షన్ కోసం ఈ డిటర్జెంట్స్ ఉపయోగిస్తారు. ఎఫ్1 కార్లు ఎల్లప్పుడూ అత్యంత వేడి ఉష్ణోగ్రతల వద్ద నడుస్తాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇందులో కొన్ని రకాల కోల్డ్ ప్రాపర్టీస్ (చల్లటి లక్షణాలు) కలిగిన మూలకాలను ఉపయోగిస్తారు.

నార్మల్ కార్లలోని ఇంజన్లలో ఉపయోగించే ఇంజన్ ఆయిల్స్ ఆల్-వెథర్ ప్రాపర్టీస్ (అన్ని కాలాలకు అనుగుణంగా ఉండే లక్షణాలను) కలిగి ఉంటాయి. కాబట్టి, ఎఫ్ లూబ్రికెంట్స్ అనేవి కేవలం ఎఫ్1 కార్ల కోసం మాత్రమే డిజైన్ చేయబడని, వీటిని నార్మల్ కార్లలో ఉపయోగించకూడదని వారు వివరించారు.

Most Read Articles

English summary
Formula One cars are an engineering marvel. From the massive front and rear wings to the powerful engine that is mounted behind the driver. The engine is part of the structural support framework. As of 2014, the engines were limited to 1.6-litre V6 and turbocharged.
Story first published: Monday, July 28, 2014, 14:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X