హైదరాబాద్‌లో ఇసుజు డి-మ్యాక్స్ పికప్ ట్రక్ విడుదల

By Ravi

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ వద్ద ప్లాంటును నిర్మిస్తున్న జపానీస్ ఆటోమొబైల్ బ్రాండ్ ఇసుజు మోటార్స్, ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన తమ పికప్ ట్రక్స్ డి-మ్యాక్స్, డి-మ్యాక్స్ స్పేస్ క్యాబ్‌లను రాష్ట్ర విపణిలో కూడా విడుదల చేసింది. ఇసుజు మోటార్స్ ఈ పికప్ ట్రక్కులను భారత్‌లో స్థానికంగ్ అసెంబుల్ చేస్తోంది. తమ ప్లాంట్ పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వస్తే, ఈ వాహనాలను పూర్తిగా ఆ ప్లాంట్‌లోనే తయారు చేయనున్నారు.

ఇసుజు డి-మ్యాక్స్ పికప్ ట్రక్ మూడు వేరియంట్లలో (సింగిల్ క్యాబ్ ఫ్లాట్ డెక్, స్పేస్ క్యాబ్ ఫ్లాట్ డెక్, స్పేస్ క్యాబ్ ఆర్చెడ్ డెక్) లభిస్తుంది. బేస్ వేరియంట్ డి-మ్యాక్స్ ఓ రెగ్యులర్ పికప్ ట్రక్, ఇది 2415 X 1705 X 450 (mm) ఫ్లాట్‌బెడ్‌ను కలిగి ఉండి, 1.2 టన్నుల పేలోడ్‌ను మోయగలదు. రెండవ వేరియంట్ అయిన స్పేస్ క్యాబ్ ఫ్లాట్ డెక్ సీట్ల వెనుక వైపు అదనంగా 1.5 అడుగుల స్థలాన్ని కలిగి ఉంటుంది.

ఇకపోతే.. ఇందులో మూడవ వేరియంట్ స్పేస్ క్యాబ్ ఆర్చెడ్ డెక్ ఓ ప్రీమియం పికప్ ట్రక్. వాస్తవానికి ఇది వాణిజ్యపరంగా ఉపయోగించుకునేందుకు కాకుండా, వ్యక్తిగతంగా ఉపయోగించుకునేందు గాను ఉద్దేశించి తయారు చేయబడినది. ఇది ఫ్లాట్ బెడ్‌ను కాకుండా, వీల్ ఆర్చెస్ వలన హంప్‌లతో కూడిన బెడ్ ఉంటుంది. ఫలితంగా దీని కార్గో స్పేస్ (1920mm X 1720mm X 480mm) కూడా తక్కువగా ఉంటుంది. అయితే, ఇతర రెండు వేరియంట్లతో పోల్చుకుంటే, ఇది మరింత స్టయిలిష్‌గా ఉంటుంది.

Isuzu D Max

రెగ్యులర్ పికప్ ట్రక్కులలో లభించిన కొన్ని విశిష్టమైన ఫీచర్లు ఈ డి-మ్యాక్స్ స్పేస్ క్యాబ్ ఆర్చెడ్ డెక్‌లో లభ్యం కానున్నాయి. డే-నైట్ రియర్ వ్యూ మిర్రర్, రిమోట్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్, బాడీ కలర్డ్ బంపర్స్, క్రోమ్ ఫినిష్ రేడియేటర్ గ్రిల్, ఇంజన్ టాకోమీటర్, ఫ్రంట్ సీట్ స్లైడ్ అండ్ రిక్లైన్, గ్రీన్ టింటెడ్ గ్లాస్, పవర్ విండోస్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి.

ఇసుజు డి-మ్యాక్స్ పికప్ ట్రక్కులలో 2.5 లీటర్, 4-సిలిండర్, కామన్ రైల్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 136 హార్స్‌పవర్‌ల శక్తిని, 1800-3200 ఆర్‌పిఎమ్ వద్ద 294 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫుల్ ట్యాంక్‌పై (76 లీటర్లు) ఇది 1000 కి.మీ. దూరం వరకు నడుస్తుంది. అంటే దీని మైలేజ్ 13.15 కెఎమ్‌పిఎల్.

ఇసుజు డి-మ్యాక్స్ పికప్ వేరియంట్లు, ధరలు ఇలా ఉన్నాయి:
ఇసుజు డి-మ్యాక్స్ సింగిల్ క్యాబ్ - రూ.5.99 లక్షలు
ఇసుజు డి-మ్యాక్స్ స్పేస్ క్యాబ్ ఫ్లాట్ డెక్ - రూ.6.19 లక్షలు
ఇసుజు డి-మ్యాక్స్ స్పేస్ క్యాబ్ ఆర్చెడ్ డెక్ - రూ.7.09 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

Most Read Articles

English summary
Isuzu, the Japanese SUV and pick-up truck manufacturer has launched its second product in Hyderabad, the D-Max pick-up, at a starting price of INR 5.99 lakhs.
Story first published: Thursday, May 22, 2014, 10:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X