జాగ్వార్ కన్నా గాడిదే నయం అంటున్న ఫ్రస్టేటెడ్ ఇండియన్

ఖరీదైన కార్లను కొనుగోలు చేయటం సామాన్యులకు ఆషామాషీ విషయం కాదు. కానీ, అదే ధనికులైతే మరో ఆలోచన లేకుండా వీటిని కొనుగోలు చేసేస్తుంటారు. ఏదేమైనప్పటికీ, ఇలాంటి కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు విలాసవంతమైన సవారీతో పాటుగా విలువైన, నాణ్యమైన సేవలను కూడా కోరుకుంటుంటారు. అలాంటి సేవలు దక్కకపోతే విసుగెత్తిపోతారు. ఇతని విషయంలోను అదే జరిగినట్లుంది.

జాగ్వార్ ఎక్స్ఎఫ్ కారును కొనుగోలు చేసిన ఓ ఇండియన్ కస్టమర్, తన జాగ్వార్ కారుపై గడ్డి, చెత్తను ఉంచి, బోగస్ కార్, బోగస్ సర్వీస్, బోగస్ కంపెనీ అని రాసి ఉన్న ఓ బ్యానెర్‌ను బానెట్‌కు తగిలించి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అంతేకాకుండా.. ఈ కారుకు ముందు వైపు ఓ 7-8 గాడిదలను తాళ్లతో కట్టేసి, వాటితో కారును లాగిస్తూ వెళ్లాడు.

indian prefer jaguar or donkey
జాగ్వార్ కన్నా గాడిదే మేలు అంటూ సందేశం కూడా ఇచ్చాడు. ఇతను ఇంతగా ఫ్రస్టేట్ కావటానికి గల కారణంగా ఇంకా స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, నాణ్యతలేని ఆఫ్టర్ సేల్స్ సర్వీసే ఇందుకు కారణమై ఉంటుందని తెలుస్తోంది. గతంలో కూడా పలు కార్ కంపెనీల సేవలను కించపరుస్తూ ఇలాంటి నిరసను చేసిన సందర్భాలున్నాయి.

ఇటలీకి చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 పెర్ఫార్మెన్స్ కారులో తరచూ మెకానికల్ సమస్యలు తలెత్తడంతో విసుగెత్తిన సదరు కారు ఓనర్, ఓ పబ్లిక్ ప్లేస్‌లో ఈ కారును సుత్తితో నుజ్జు నుజ్జు చేసి తన నిరసనను వ్యక్తం చేసిన సంగతి తెలిసినదే.

ఏదేమైనప్పటికీ.. ఈ జాగ్వార్ ఎక్స్ఎఫ్ విషయంలో అసలు ఏం జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటను సంబంధించి జాగ్వార్ ఇండియా అధికారులు స్పంధించాల్సి ఉంది.

Most Read Articles

English summary
The person took his Jaguar XF to the local Jaguar service centre with posters quoting "bogus car," "bogus service" and "bogus company" on the car. To add insult to injury, he got some hay on the car and managed to find a few donkeys, tied them to the car and made them pull the car!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X